బెంగళూరు: ఇద్దరు మహిళలు పురుషుల వేషం వేసి ఆ దుస్తులు ధరించారు. ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు. (Women Robbery) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జనవరి 13న ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన అతడు ఇది గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆటో డ్రైవర్ ఇంట్లో దొంగతనం చేసినట్లు గ్రహించారు. దుస్తులు, వారి వేషధారణ ఆధారంగా ఆ దొంగలు పురుషులని పోలీసులు తొలుత భావించారు.
అయితే స్కూటీ నంబర్ ఆధారంగా చోరీకి పాల్పడింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు. బెంగళూరుకు చెందిన షాలు, నీలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతర దొంగతనం కేసులతో వీరికి సంబంధం ఉన్నదా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Watch | 2 Women Disguise As Men For Robbery In Bengaluru. How They Were Caught pic.twitter.com/pRyDg0VDoE
— NDTV (@ndtv) January 16, 2026
Also Read:
Watch: డ్యూటీ ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరణ.. తర్వాత ఏం జరిగిందంటే?
Nilgai Crashes Into Car | కారులోకి దూసుకొచ్చిన దుప్పి.. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి మృతి
Protests In Bengal | జార్ఖండ్‌లో వలస కార్మికుడు మృతి.. బెంగాల్లో భారీ నిరసన
ED office searched by Police | ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసులు రైడ్.. సీసీటీవీ ఫుటేజ్ సీజ్