హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కేబుల్ చానళ్లకు గతంలోలాగే ఐఅండ్పీఆర్లో అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక హామీఇచ్చారు. సవరించిన జీవోలో సైతం కేబుల్ చానళ్లకు జరిగిన అన్యాయాన్ని టీయూడబ్ల్యూజే, కేబుల్ చానెల్స్ జేఏసీ నేతలు మంగళవారం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. కేబుల్ చానళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని కమిషనర్‌కు టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి ఏ మారుతీసాగర్ వివరించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో తెంజు ప్రధాన కార్యదర్శి రమణకుమార్, టీయూడబ్ల్యూజే కోశాధికారి పీ యోగానంద్ తదితరులు ఉన్నారు.