CWG-2026 | అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. కామన్వెల్త్ గేమ్స్‌లో విజయనగరం కుర్రాడికి రజతం
CWG-2026 | సరిగ్గా పదహారేళ్ల క్రితం ఢిల్లీ (Delhi) లో కామన్వెల్త్ పోడియం (Commonwealth Games) పై తండ్రి జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు గ్లాస్గో (Glasgo) వేదికగా అతడి కొడుకు వెండి పతకాన్ని ముద్దాడాడు. అతడే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన వల్లూరి అజయ్ బాబు (Valluri Ajaya Babu).
CWG-2026 : సరిగ్గా పదహారేళ్ల క్రితం ఢిల్లీ (Delhi) లో కామన్వెల్త్ పోడియం (Commonwealth Games) పై తండ్రి జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు గ్లాస్గో (Glasgo) వేదికగా అతడి కొడుకు వెండి పతకాన్ని ముద్దాడాడు. అతడే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన వల్లూరి అజయ్ బాబు (Valluri Ajaya Babu). సోమవారం రాత్రి జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ (Weight Lifting) పోటీల్లో 79 కేజీల విభాగంలో రెండోస్థానంలో నిలిచాడు.
విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అజయ్ మొత్తంగా 330 కిలోల (స్నాచ్ సెక్షన్లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ సెక్షన్లో 181 కిలోలు) బరువు ఎత్తాడు. ఫైనల్లో మలేసియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ ఒక కేజీ అదనంగా ఎత్తి స్వర్ణాన్ని ఎగరేసుకుపోయాడు. ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే (325 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అజయ్ బాబు సాధించిన పతకంతో ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరినట్లయింది.
అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడంతో ఆయన గ్రామం పేరు నాడు అంతర్జాతీయ వేదికపై మారుమోగింది. నేడు ఆయన కుమారుడు సత్తా చాటాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

