వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ (50) జనగాం జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో గ్రామంలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి భాస్కర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అయితే బాలిక ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భాస్కర్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే రాజీ కుదిర్చి ఈ కేసును నీరుగార్చేందుకు ఊరిలోని పెద్దమనుషులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.