న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్(SLvIND)కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాలోకి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వచ్చేశాడు. మళ్లీ అతనికి జట్టులో స్థానం కల్పించారు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు శుభమన్ గిల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. మిగితా ప్లేయర్లలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ద్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్ ఉన్నారు. అయితే ఫిట్నెస్ ఆధారంగా సాయి సుదర్శన్, జస్పీత్ బుమ్రాలను తుది జట్టులోకి తీసుకుంటారు. బీసీసీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఆ ఇద్దరిపై తుది నిర్ణయం ఉంటుంది. తొలి టెస్టుకు వాషింగ్టన్ సుందర్ సెలెక్షన్కు అందుబాటులో లేడు. ఇక ఆగస్టు 7వ తేదీన కొలంబోలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నది. ఆగస్టు 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23వ తేదీ నుంచి కొలంబోలో రెండో టెస్టు ప్రారంభంకానున్నది.
🚨 News 🚨#TeamIndia‘s squad for the 2⃣-match Test Series against Sri Lanka announced
Note: Washington Sundar was not available for selection for the first Test.
More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj
— BCCI (@BCCI) July 28, 2026