భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్
భూ భారతి ఆన్లైన్ పోర్టల్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంను ఆయన పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి..
తుంగతుర్తి, సెప్టెంబర్ 24 : భూ భారతి ఆన్లైన్ పోర్టల్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంను ఆయన పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను త్వరగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, డిప్యూటీ ఎమ్మార్వో కంట్లమయ్య, ఆర్ఐలు శ్రీధర్, మణికుమార్, రెవిన్యూ సిబ్బంది జోహార్ పాల్గొన్నారు.

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్
పెద్ద చెరువు పరిశీలన
తుంగతుర్తి మండల కేంద్రంలోని వెలుగుపల్లి రోడ్డులో ఉన్న పెద్ద చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షానికి అలుగు పోస్తుండడంతో రెవిన్యూ శాఖ అధికారితో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా చేపలు పట్టేందుకు చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దన్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థల భవనాల్లో ఉండవద్దన్నారు. ఆయన వెంట ఆర్ఐ శ్రీధర్, జిపిఓ శ్యాం కుమార్ ఉన్నారు.
చెరువును తలపిస్తున్న వీధి
తుంగతుర్తి మండల కేంద్రంలోని రెండో వార్డులో మహాత్మా గాంధీ విగ్రహం సందు నుండి స్టేషన్ రోడ్డుకు వెళ్లే వీధి మొత్తం వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీళ్లు మొత్తం వీధుల్లో చేరి మొత్తం జలమయంగా మారింది. అటు నుండి వెళ్లేందుకు వాహనదారులు, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

