BRS Leaders Visit | తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్న రేవంత్ సర్కార్ : బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
BRS Leaders Visit | విద్యుత్ కృత్రిమ కొరత పేరిట తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల : విద్యుత్ కృత్రిమ కొరత పేరిట తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ,ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి , అనిల్ యాదవ్ , మాజీ మంత్రి జోగు రామన్న మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప ,నాయకులు జాన్సన్ నాయక్ , రామకృష్ణారెడ్డి తదితరులు ఎస్టీపీపీని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) లో అన్ని సదుపాయాలూ ఉన్నప్పటికీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ విద్యుదుత్పత్తి చేస్తోందని మండిపడ్డారు. 24 గంటల కరెంటు ఇస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, పండించిన పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుందని విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది ప్రకృతి తెచ్చిన కొరత కాదని, కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ విద్యుత్ కొరత అని విమర్శించారు.

ప్రభుత్వ ఆదేశాలతోనే చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఇంజినీర్లు తెలిపారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఆనాటి పాత చీకటి రోజులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు, బీడీ కార్మికులు, ప్రజలంతా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన గురువు చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ తెలంగాణను రేవంత్ నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి అవినీతి, అరాచకాలు, దోపిడీ, కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులు, ప్రజలపై లేదని ఆరోపించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

