Bihar Minister | ‘అమెరికా, జపాన్‌లోనూ ఇలాంటివి జరుగుతాయి’.. లైంగిక వేధింపులపై బీహార్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు
Bihar Minister | బాగా అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌లో కూడా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు వంటివి జరుగుతాయని బీహార్ మంత్రి అన్నారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపు సంఘటనలపై నిర్దిష్ట కథనాలు సృష్టించవద్దని జర్నలిస్టులను ఆయన హెచ్చరించారు.
పాట్నా: బాగా అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌లో కూడా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు వంటివి జరుగుతాయని బీహార్ మంత్రి అన్నారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపు సంఘటనలపై నిర్దిష్ట కథనాలు సృష్టించవద్దని జర్నలిస్టులను ఆయన హెచ్చరించారు. (Bihar Minister) బీహార్‌లోని సమస్తిపూర్, జమూయి, దర్భంగాలో ఇటీవల బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలపై జేడీయూకు చెందిన మంత్రి అశోక్ చౌదరికి మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ఒక నిర్దిష్ట కథనాన్ని సృష్టించవద్దు’ అని ఒక జర్నలిస్ట్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పారు.
కాగా, మంత్రి అశోక్ చౌదరి ఈ సందర్భంగా బీహార్ ప్రజలను కించపరిచారు. ‘ఇది 14 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం. ఇక్కడ దుర్మార్గులు, చదువురానివారు, అజ్ఞానులు, అసభ్యంగా ప్రవర్తించేవారు, సంస్కారం లేనివారికి కొదవ లేదు. చట్ట పాలనను దెబ్బతీయడంలోనూ, బీహార్‌కు చెడ్డ పేరు తీసుకురావడంలోనూ వీరు పాత్ర పోషిస్తుంటారు’ అని విమర్శించారు.
అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న లైంగిక వేధింపుల సంఘటనలపై ప్రభుత్వానికి ఇక ఏమాత్రం బాధ్యత, అధికారం లేదా? అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ప్రజలు వీధుల్లో ఎలా తిరగాలి? అని మంత్రి అశోక్ చౌదరిని నిలదీశారు. దీనికి ఆయన ఘాటుగా స్పందించారు. ఎలాంటి నిర్దిష్ట కథనాన్ని సృష్టించవద్దని ఆ జర్నలిస్ట్‌తో అన్నారు. ‘మేం ఎలాంటి కథనాన్ని సృష్టించడం లేదు సార్’ అని ఆ రిపోర్టర్ సమాధానమిచ్చారు.
మరోవైపు జర్నలిస్టుల ప్రశ్నలు ప్రతికూల ధోరణిలో ఉన్నాయని మంత్రి అశోక్ చౌదరి ఆరోపించారు. ప్రశ్నలు ఎలా అడగాలో అన్నది ఆయన వివరించారు. ‘వాస్తవానికి ఏం జరిగిందో అడగండి, నేను దానికి సమాధానం ఇస్తాను. ప్రభుత్వానికి అధికారం లేదని మీరు నిర్ధారించలేరు. ఒక జర్నలిస్ట్ అలా నిర్ణయించలేరు. నా మాట వినండి, కేవలం ప్రశ్న అడిగి వెళ్లిపోవద్దు. ఈ రోజు మాపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారి విషయానికొస్తే, వారి హయాంలో పరిస్థితి ఎలా ఉండేదో బీహార్ ప్రజలు చూడలేదా? ప్రభుత్వానికి అధికారం ఉంది, ఆ అధికారం అలాగే ఉంటుంది’ అని అన్నారు.
అలాగే లైంగిక వేధింపు సంఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకున్నదని మంత్రి అశోక్ చౌదరి తెలిపారు. జమూయిలో 24 గంటల్లోపు, సమస్తిపూర్‌లో 12 గంటల్లోపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దుర్మార్గులకు కొదవ లేదని అన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని జర్నలిస్టులు ప్రస్తావించినప్పుడు, ‘ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరుగుతాయి. అమెరికాలోనూ, జపాన్‌లోనూ ఇవి జరుగుతుంటాయి. అమెరికాలో ఇలాంటివి జరుగవని ఏమీ లేదు. మనకంటే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. అయినప్పటికీ అక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అసలు విషయం ఏమిటంటే, ప్రభుత్వం నేరస్తులను కాపాడాలని చూస్తోందా లేక వారిపై చర్యలు తీసుకోవడంలో మనం విఫలమవుతున్నామా అనేది కీలకమైన అంశం’ అని అన్నారు.
కాగా, ఇలాంటి సంఘటనలు ఇకపై కూడా జరుగుతూనే ఉంటాయా? మరో జర్నలిస్ట్ ప్రశ్నించగా మంత్రి అశోక్ చౌదరి వివాదస్పదంగా బదులిచ్చారు. ‘రేపటి నుంచి ఇలాంటి సంఘటనలు అస్సలు జరుగవని ఏ ముఖ్యమంత్రి గానీ, ప్రపంచ నాయకుడు గానీ చెప్పలేరు. అయితే నితీశ్ కుమార్ నెలకొల్పిన విధానం ఏమిటంటే, ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగితే, నేరస్తులపై చట్టం తన పూర్తి శక్తితో ఒక బుల్డోజర్లా విరుచుకుపడుతుంది’ అని అన్నారు.
मंत्री अशोक चौधरी जमुई, समस्तीपुर लड़की छेड़खानी मामले पर कहा
बिहार 14 करोड़ का आबादी वाला प्रदेश है दुष्ट, अनपढ़, जाहिल, गवार और देहाती लोगों की कमी नहीं है जो कानून का राज्य स्थापित करने में बिहार को बदनाम करने में उनकी भूमिका है.!
नीतीश कुमार ने सुशासन की व्यवस्था स्थापित… pic.twitter.com/RIvx6EKB7X
— Sadan Singh Rajput (@SadanJee) September 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

