బతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు. కూర్చుంటే బతుకు నడవదు. మరి నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
గుడ్ మార్నింగ్ సార్! విద్యార్థులంతా గ్రీట్ చేశారు నందు సార్ గదిలోకి రాగానే. చిరనవ్వుతో గుడ్ మార్నింగ్ అని వేదికపైకి చేరుకున్నారాయన. కాసేపు అందరివైపు చూసి హ్యాపి మార్నింగ్ అన్నారు. హ్యాపీ మార్నింగ్ అని మ�