కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు జార్ఖండ్‌లో మరణించాడు. బెంగాల్ మాట్లాడినందుకు అతడ్ని కొట్టి చంపారని మృతుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన భారీ నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. (Protests In Bengal) ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగాకు చెందిన 37 ఏళ్ల అల్లావుద్దీన్ షేక్ జార్ఖండ్‌లో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గురువారం ఇంట్లో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు.
కాగా, బెంగాలీ మాట్లాడే వలస కార్మికుడు కావడంతో అల్లావుద్దీన్ షేక్‌ను కొట్టి చంపినట్లు అతడి కుటుంబం ఆరోపించింది. శుక్రవారం బెల్దంగాలో అతడి మృతదేహంతో భారీ నిరసన చేపట్టారు. జాతీయ రహదారి 12ను నిరసనకారులు దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆ మార్గంలో రైలు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు ఈ నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. మహిళా రిపోర్టర్లు సహా ఐదుగురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ ఈ సంఘటనపై స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో జన సమూహాలను నియంత్రించడం కష్టమని తెలిపారు. ‘జర్నలిస్టులపై దాడులకు నేను మద్దతు ఇవ్వడం లేదు. కానీ వారు గుంపు లోపలికి వెళ్లకుండా ఉండాలి. అది నా చేతుల్లో లేదు’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అశాంతిని రాజేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే బెంగాల్లో శాంతి భద్రతలు లోపించాయని బీజేపీ విమర్శించింది.
Murshidabad, West Bengal: Islamist Mob Indulges in Vandalism, Arsoning Over Death of Migrant Worker Alai Sheikh in Jharkhand
Locals in West Bengal’s Beldanga blocked National Highway 12 on Friday, burning tyres and causing massive traffic jams between northern and southern… pic.twitter.com/yFexKpQdzS
— Ritam English (@english_ritam) January 16, 2026
Also Read:
ED office searched by Police | ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసులు రైడ్.. సీసీటీవీ ఫుటేజ్ సీజ్
Gauri Lankesh murder case | గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు.. ఇండిపెండెంట్‌గా గెలుపు
Watch: డ్యూటీ ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరణ.. తర్వాత ఏం జరిగిందంటే?