ముంబై: జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు (Gauri Lankesh murder case) నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఫలితాలు వెలువడిన తర్వాత తన మద్దతుదారులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నాడు. గౌరీ లంకేష్ హత్య కేసులో ఇప్పటి వరకు తనకు ఎలాంటి శిక్ష పడలేదని శ్రీకాంత్ పంగర్కర్ తెలిపాడు. న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నాడు.
కాగా, జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5న కర్ణాటకలోని బెంగళూరులో ఇంటి బయట కాల్చి చంపారు. ఆమె హత్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ హత్య కేసులో శ్రీకాంత్ పంగర్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 సెప్టెంబర్ 4న కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీకాంత్ పంగర్కర్ పోటీ చేసి విజయం సాధించడం మరోసారి చర్చకు దారితీసింది.
VIDEO | Jalna, Maharashtra: Journalist Gauri Lankesh murder accused Shrikant Pangarkar celebrates his victory with supporters after winning the Jalna Municipal Corporation elections as an independent candidate.
#Jalna #MaharashtraCivicPolls2026
(Full video available on PTI… pic.twitter.com/slFETxVN1w
— Press Trust of India (@PTI_News) January 16, 2026
Also Read:
103 Year Old Woman | వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన బంధువులు.. పుట్టిన రోజునే తిరిగి బతికిన ఆమె
Watch: డ్యూటీ ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరణ.. తర్వాత ఏం జరిగిందంటే?