Shivam Dube | శివమ్ దూబే ఫేవరెట్ హీరో మన తెలుగు స్టార్… సూపర్ స్టార్‌పై క్రికెటర్ ప్రశంసలు వైరల్
Shivam Dube | సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయనకు దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా చేరాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో అని దూబే ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shivam Dube | సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయనకు దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా చేరాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో అని దూబే ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడిన శివమ్ దూబే, తాను హిందీ డబ్బింగ్లోనూ తెలుగు సినిమాలు చూస్తానని చెప్పాడు. ముఖ్యంగా మహేశ్ బాబు సినిమాలు మిస్ అవ్వనని వెల్లడించాడు. “మహేశ్ బాబు స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయనలో ఉండే ఆ గ్రేస్ వేరు. అందుకే ఆయనే నా ఫేవరెట్ హీరో” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఒక జాతీయ క్రికెటర్ ఇలా తెలుగు హీరోపై ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది.
మహేశ్ బాబు వయసు పెరుగుతున్నా మరింత యంగ్‌గా కనిపిస్తారని దూబే ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆయన మెయింటైన్ చేసే ఫిజిక్, డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయని చెప్పాడు. కేవలం లుక్స్ మాత్రమే కాదు, మహేశ్ బాబు చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, ఆయన వ్యక్తిత్వం కూడా తనను ఆకర్షించాయని వెల్లడించాడు. గ్రౌండ్లో ఎంత బిజీగా ఉన్నా, సమయం దొరికినప్పుడు మహేశ్ బాబు సినిమాలు చూస్తానని తెలిపాడు. ప్రస్తుతం శివమ్ దూబే టీమ్ ఇండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతని పవర్ హిట్టింగ్ ప్రత్యేకం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ, కెప్టెన్ ధోని మార్గదర్శకత్వంలో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. అవసరమైనప్పుడు మీడియం పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగలగడం అతని ప్రత్యేకత. అతని భారీ షాట్లు చూసినప్పుడు అభిమానులకు యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడని పలువురు అభిప్రాయపడుతుంటారు.
ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మహేశ్ బాబు, ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

