ముంబై: వృద్ధురాలి శరీరంలో కదలిక లేకపోవడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు భావించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వృద్ధురాలి కాలిలో కదలిక కనిపించింది. దీంతో పుట్టిన రోజునే తిరిగి బతికిన ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. (103 Year Old Woman) మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామ్‌టెక్ ప్రాంతంలో నివసించే 103 ఏళ్ల వృద్ధురాలు గంగాబాయి సఖారే జనవరి 12న సోమవారం సాయంత్రం అచేతనంగా ఉన్నది. శరీరంలో కదలిక లేకపోవడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు.
కాగా, మరునాడైన మంగళవారం ఉదయం గంగాబాయి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ వృద్ధురాలి పాదాల్లో స్వల్ప కదలికను మనవడు రాకేష్ గుర్తించాడు. దీంతో ముక్కులో ఉంచిన దూది తీయగానే గంగాబాయి గాఢంగా శ్వాస తీసుకున్నది. చనిపోయినట్లు భావించిన వృద్ధురాలు బతికినట్లు తెలుసుకుని ఆమె కుటుంబం సంతోషించింది. అంత్యక్రియల ఏర్పాట్లను విరమించింది.
మరోవైపు అదే రోజున గంగాబాయి పుట్టిన రోజు. జన్మదినం రోజున ఆమె చావు నుంచి బయటపడటంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపోయారు. దీంతో ఆ వృద్ధురాలి బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించారు. గంగాబాయి చావు వార్త తెలిసి వచ్చిన వారంతా ఆమె బర్త్ డే కేక్ తిని తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే ఈ విషయం తెలుసుకుని స్థానికులతోపాటు సమీప ప్రాంతాలకు చెందిన వారు ఆశ్చర్యపోయారు. పుట్టిన రోజు నాడు మృత్యువును జయించిన గంగాబాయిని చూసేందుకు ఆ ఇంటికి క్యూ కడుతున్నారు.
Also Read:
Tej Pratap Yadav | తల్లిదండ్రులు, తమ్ముడ్ని కలిసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎందుకంటే?
Cop’s Cook, Driver Turn Witness | పోలీస్ అధికారి డ్రైవర్, వంట మనిషి.. వందకుపైగా కేసుల్లో సాక్షులు
Daughter Beaten To Death | దుస్తులు మురికి అయ్యాయని.. కుమార్తెను కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి
Air Hostess Dies By Suicide | ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య.. మాజీ ప్రియుడిపై కేసు