పాట్నా: కుటుంబంతో పాటు ఆర్జేడీకి దూరమైన తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులను కలిశారు. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసానికి మంగళవారం వెళ్లారు. తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిని కలిసి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను కూడా తేజ్ ప్రతాప్ కలిశారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే దహి-చురా విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు దిగారు.
కాగా, సోదరుడు తేజస్వి యాదవ్ కుమార్తె కాత్యాయణిని తేజ్ ప్రతాప్ యాదవ్ ఎత్తుకోవంతో పాటు కుమార్తె వరుసైన ఆ చిన్నారితో నవ్వుతూ ఫొటోలు దిగారు. రాజకీయంగా, కుటుంబ పరంగా విభేదాలున్నప్పటికీ తమ బంధాలు చెక్కుచెదరలేదన్న సంకేతాన్ని ఇచ్చారు.
మరోవైపు గత ఏడాది చిరకాల స్నేహితురాలితో కలిసి ఉన్న ఫొటోను తేజ్ ప్రతాప్ షేర్ చేయడంతో పాటు ఆమెతో తన సంబంధాన్ని బహిర్గతం చేశారు. దీనిపై ఆగ్రహించిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్‌ను కుటుంబంతో పాటు పార్టీ నుంచి వెలివేశారు.
అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆర్జేడీ కూడా ఘోర పరాజయం పొందింది. ఈ పరిణామాల నేపథ్యంలో తల్లిదండ్రులు, సోదరుడ్ని తేజ్ ప్రతావ్ యాదవ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
आज अपने पिताजी आदरणीय श्री लालू प्रसाद यादव जी, माता जी आदरणीय श्रीमती राबड़ी देवी जी से 10 सर्कुलर रोड स्थित आवास पहुंचकर मुलाकात कर आशीर्वाद प्राप्त किया और अपने छोटे भाई और बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी से भी भेंट मुलाकात कर कल 14 जनवरी को मकर संक्रांति के अवसर पर… pic.twitter.com/T2nZ5qz3x6
— Tej Pratap Yadav (@TejYadav14) January 13, 2026
Also Read:
Pipeline Burst | పగిలిన నీటి పైపులు.. నీట మునిగిన కాలనీ
Girl Gang-Raped In Car | 12వ తరగతి విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
Watch: పోలీస్ వాహనం ముందే బైక్ విన్యాసాలు.. పట్టించుకోని పోలీసులు