జైపూర్: స్కూల్కు వెళ్తున్న విద్యార్థినిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang-Raped In Car) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాపాసర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది.
కాగా, జనవరి 6న ఉదయం ఆ బాలిక స్కూల్కు బయలుదేరింది. మార్గమధ్యలో ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కదులుతున్న కారులో ఒకరు తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు కొన్ని గంటల తర్వాత పొరుగు గ్రామంలోకి ఆ కారు ప్రవేశించింది. అనుమానించిన స్థానికులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఆ యువకులు బాలికను కారు నుంచి బయటకు తోసి పారిపోయారు. ఆ గ్రామస్తులు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.
అయితే జనవరి 11న ఆ బాలిక కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన యువకులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Bangladeshi Flag | ఇంటర్నేషనల్ స్కూల్లో బంగ్లాదేశ్ జెండా.. బజరంగ్ దళ్ హెచ్చరిక
Bangladesh Balloon | బంగ్లాదేశ్ నుంచి బెలూన్.. అస్సాంలో ల్యాండ్
Chhattisgarh Exam Paper | కుక్క పేరు ప్రశ్నకు ‘రామ్’ ఐచ్ఛికం.. ఇద్దరు టీచర్లు సస్పెండ్
Massive Fire Breaks In Himachal | హిమాచల్ ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం.. బాలుడు సజీవ దహనం