గౌహతి: బంగ్లాదేశ్‌కు చెందిన పెద్ద బెలూన్ (Bangladesh Balloon) కలకలం రేపింది. పొలంలో పడిన దానిని చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ బెలూన్‌పై దర్యాప్తు చేస్తున్నారు. అస్సాంలోని కాచర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం బోర్ఖోలా ప్రాంతంలోని పొలంలో పెద్ద బెలూన్ పడింది. గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగిరి వచ్చిన పెద్ద బెలూన్ను పరిశీలించారు. బంగ్లాదేశ్ సిల్హెట్‌లోని గిలాచార ద్విముఖి హై స్కూల్ పేరు, ముగ్గురు వ్యక్తుల ఫొటోలు, బెంగాలీలో వ్యాఖ్యలు దానిపై ఉండటాన్ని గమనించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి అస్సాంలోకి ఆ బెలూన్ ఎలా వచ్చింది అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Kapil Sibal | ‘ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు’.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబల్
Girl Gang Raped | బాలికపై సామూహిక అత్యాచారం.. 8 మంది యువకులు అరెస్ట్