అహ్మదాబాద్: ఒక బాలికపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక, ఆమె కుటుంబానికి తెలిసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Gang Raped) గుజరాత్లోని నవసారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాన్స్డా నగర పరిధిలోని గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక జనవరి 7న రాత్రి 10.30 గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కాగా, బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఆ బాలికను చూశారు. బాలికతో పాటు ఆమె కుటుంబానికి తెలిసిన ఆ ముగ్గురు ఆమెను కిడ్నాప్ చేశారు. రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు యువకులు ఉన్నారు. ఎనిమిది మంది కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు బయటకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం అంతటా వెతికారు. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలిక జరిగిన సంగతి చెప్పింది. దీంతో ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా, పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఏడుగురు 20-20 ఏళ్ల వయస్సున్న వారని, ఒకరు మైనర్ బాలుడని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్
Vande Bharat | వీల్లో ఇరుక్కున్న బోల్ట్.. గంట పాటు ఆగిన వందే భారత్