లక్నో: ఒక నగరంలో తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా పేరు గాంచిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఒక వ్యక్తితో ఆమెకు ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తిని వదిలేసిన ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నది. ప్రతీకారంతో రగిలిపోయిన మాజీ భర్త, వివాహ వార్షికోత్సవం రోజున ఆమెను కాల్చి చంపాడు. (first woman auto driver’s murder) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 4న ఝాన్సీ తొలి మహిళా ఆటో డ్రైవర్ అనితా చౌదరి హత్యకు గురైంది. రాత్రి వేళ ఆటో నడుపుతున్న ఆమెను కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న అనిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె సమీపంలో ఆటో బోల్తాపడి ఉండటాన్ని గమనించారు.
కాగా, తన భార్య అనిత హత్యకు ముఖేష్ ఝా, శివమ్, మనోజ్ కారణమని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. శివమ్, మనోజ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ముఖేష్ ఝా ఒక చోట ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. జనవరి 10న తెల్లవారుజామున పోలీసులు అతడ్ని చుట్టుముట్టారు.
మరోవైపు ముఖేష్ కాల్పులు జరుపడంతో ప్రతిగా అతడి కాలుపై కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పిస్టల్, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిత హత్యకు కారణాన్ని ముఖేష్ నుంచి పోలీసులు తెలుసుకున్నారు.
ఝాన్సీ తొలి మహిళా ఆటో డ్రైవర్ అనిత హత్యకు ప్రేమ వ్యవహారం, ద్రోహం, ప్రతీకారం కారణం అని పోలీసులు తెలిపారు. అనిత, ముఖేష్ ఝా మధ్య ఆరేడేళ్లుగా సంబంధం ఉందని చెప్పారు. ఒక గుడిలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే కొంతకాలానికే ముఖేష్‌ను వీడిన అనిత మరో పెళ్లి చేసుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ద్రోహం చేసిన ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ముఖేష్ భావించినట్లు చెప్పారు. వివాహ వార్షికోత్సవం రోజున మాజీ భార్య అయిన అనిత ఆటో నడుపుతుండగా అనుచరులతో కలిసి కాల్చి చంపాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Mamata Banerjee | ‘బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ప్రమేయం’.. తన వద్ద పెన్ డ్రైవ్‌లు ఉన్నాయన్న మమతా
judge leaves courtroom | టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట.. వెళ్లిపోయిన న్యాయమూర్తి