తిరువనంతపురం: ఐదేళ్ల సవతి కుమార్తె పట్ల సవతి తల్లి దారుణంగా ప్రవర్తించింది. నిద్రలో మూత్ర విసర్జన చేస్తున్నందుకు ఆ చిన్నారి ప్రైవేట్ భాగం వద్ద వాతలు పెట్టింది. (Stepmother Burns Child’s Private Parts) ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సవతి తల్లిని అరెస్ట్ చేశారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంజిక్కోడ్ ప్రాంతంలో నివసించే ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ఐదేళ్ల సవతి కుమార్తె నిద్రలో మూత్ర విసర్జన చేయడంపై ఆగ్రహించింది. ఆ చిన్నారి ప్రైవేట్ భాగం వద్ద అట్లకాడతో వాతలు పెట్టింది.
కాగా, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన ఆ బాలిక కూర్చోవడానికి ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్‌కు ఈ విషయం తెలిసింది. పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చింది. దీంతో బీహార్‌కు చెందిన సవతి తల్లిపై బీఎన్ఎస్, జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు.
మరోవైపు ఆ చిన్నారిని పిలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణకు అప్పగించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నేపాల్ జాతీయుడైన ఆ బాలిక తండ్రి ఒక హోటల్లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
judge leaves courtroom | టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట.. వెళ్లిపోయిన న్యాయమూర్తి
Air India Flights Diverted | బ్రిటన్ బయలుదేరిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు.. దారి మళ్లింపు
Man Shoots Wife, Children, Kills Self | భార్య, పిల్లలను కాల్చి చంపి.. వ్యక్తి ఆత్మహత్య
Watch: బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?