చండీగఢ్: ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువారి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. (Man Shoots Wife, Children Kills Self) పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ బిల్డర్, ఫైనాన్షియర్. ఒక సెలూన్ షాపు కూడా అతడు నిర్వహిస్తున్నాడు. 40 ఏళ్ల భార్య జస్వీర్ కౌర్, ఇద్దరు కుమార్తెలైన పదేళ్ల మన్వీర్ కౌర్, ఆరేళ్ల పర్మీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్నాడు.
కాగా, జనవరి 8న ఉదయం పనిమనిషి ఆ ఇంటికి వచ్చింది. ఎంతకీ డోర్ తీయకపోవడంతో అద్దెకు ఉన్న వ్యక్తి, పొరుగువారిని పిలిచింది. వారు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అమన్‌దీప్ సింగ్, అతడి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు రక్తం మడుగుల్లో పడి మరణించడాన్ని గమనించారు. అక్కడ ఒక పిస్టల్ కూడా వారికి కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అమన్‌దీప్ సింగ్ పిస్టల్‌తో భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ గదిలో నేలపై పడి ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఫిరోజ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వారింట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి, పొరుగువారు, స్థానికుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Bengal Governor Gets Threat Email | ఈడీ రైడ్స్ హై డ్రామా తర్వాత.. బెంగాల్ గవర్నర్‌కు బెదిరింపులు