Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలైన రోజు నుంచే ఈ సినిమాపై చర్చలు మొదలయ్యాయి. ట్రైలర్ విడుదలతో పాటు దేశవ్యాప్తంగా ప్రీమియర్ షో టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే ప్రేక్షకులు భారీగా స్పందించడం విశేషం. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో కేవలం ప్రీమియర్ షోల కోసమే 86,680 కి పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
ఈ సినిమాను అధికారిక విడుదలకు ముందే చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగి కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. తాజా ట్రైలర్‌ను చూస్తే ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత వయలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రణ్వీర్ సింగ్‌తో పాటు ప్రముఖ నటులు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు కథలో ప్రధాన మలుపులు తీసుకువస్తాయని తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను జియో స్టూడియోస్ మరియు బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో భారీ హైప్ సృష్టించిన ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.