Komatireddy Venkat Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండదు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy | రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
Komatireddy Venkat Reddy | నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
శనివారం తిప్పర్తి మండలంలో పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న అ నంతరం ఎర్రగడ్డలగూడెంలో మీడియాతో ఆ యన మాట్లాడారు. ఎల్ఎల్బీసీ సొరంగంపై స్పంది స్తూ .. దా న్ని పూర్తిచేస్తే బీఆర్ఎస్కు మరో మూ డు సీట్లు వచ్చేవని చెప్పుకొచ్చా రు. ‘మళ్లొచ్చే ఎన్నిక ల్లో.. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో ఉండనే ఉండదు… అ స్సలు తెలంగాణలో ఉండదా పార్టీ” అం టూ ఘంటాపథంగా చెప్పారు.
పక్కనే ఉ న్న కార్యకర్తలు ‘సార్ మీరు కాంగ్రెస్ పార్టీ ఉండదంటున్నారు… బీఆర్ఎస్ అనాలి” అంటూ గుర్తుచేశారు. వెంటనే తేరుకుని దాన్ని కవర్ చేసుకునే క్రమంలో ‘కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటది… బీఆర్ఎస్ ఉండ దు… ఇక జిల్లాలో మిగలదు.. సూర్యాపేట కూడా మేము గెలుస్తం’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి ఇక కాంగ్రెస్ ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. ‘పొరపాటున నిజం చెప్పినవ్ వెంకన్న’ అని ఒకరంటే… మనసులో మాట మీడియా ముందు బయటపెట్టినట్టు ఉంది అని మరొకరు పోస్టు చేశారు. ఇంకొకరు మంత్రి అప్పుడప్పుడు ఇలా నిజాలు నిర్భయంగా మాట్లాడుతారని సెటైర్లు విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

