Venki-Trivikram | వెంకటేష్- త్రివిక్రమ్ మూవీలో ట్విస్ట్లే ట్విస్ట్‌లు .. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ఫుల్ యాక్షన్!
Venki-Trivikram | విక్టరీ వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా ఎటువంటి హడావిడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటనను కొంతకాలం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
Venki-Trivikram | విక్టరీ వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమా ఆదర్శ కుటుంబం ఎటువంటి హడావిడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటనను కొంతకాలం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇటీవల ‘కేజీఎఫ్’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వేసవి కాలం నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. సినిమా కథనం విషయానికి వస్తే, ఇది కేవలం సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కథగా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా సినిమా మొదటి భాగం మొత్తం వినోదంతో నిండిపోతుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు సినిమా ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి వెంకటేష్ వింటేజ్ చిత్రాల తరహాలో నవ్వులు పూయించే ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగులు, వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక భారీ ట్విస్ట్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ట్విస్ట్ తర్వాత సినిమా కథ ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి మారుతుందని సమాచారం. సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఆసక్తికరంగా మలుపులు తిరుగుతుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా సినిమా రెండో భాగం మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలో కనిపించిన థ్రిల్లింగ్ టర్న్స్ను గుర్తు చేసేలా ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కథలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్నీ సమపాళ్లలో మిళితమై ఉండేలా దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత చిత్రం ‘గుంటూరు కారం’ సమయంలో ఎదురైన విమర్శలు, లోపాలు మళ్లీ రిపీట్ కాకుండా ఈ సినిమాపై త్రివిక్రమ్ మరింత జాగ్రత్తగా పని చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వర్కవుట్ అయిన క్లాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా ఉండేలా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

