బెంగళూరు: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు ప్రయత్నించాడు. అయితే అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. పొరుగువారు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. (Man Tries To Set Brother’s House On Fire) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గోవిందపుర గ్రామంలోని అన్న రామకృష్ణ ఇంటికి తమ్ముడు మునిరాజు అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. ఆ ఇంటికి బయట నుంచి లాక్ వేశాడు. పెట్రోల్ చల్లి నిప్పంటించాడు.
కాగా, మునిరాజు చేతులు, దుస్తులపై కూడా పెట్రోల్ పడింది. దీంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో సహాయం కోసం కేకలు వేశాడు. ఇరుగుపొరుగువారు అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పి అతడిని కాపాడారు. తీవ్ర కాలిన గాయాలైన మునిరాజును తొలుత హోస్కోటేలోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అన్న ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించిన తమ్ముడు మునిరాజుకు మంటలు అంటుకున్నట్లు గ్రహించారు. ఆస్తి అమ్మకాన్ని వ్యతిరేకించినందుకు అన్నపై కక్షతో ఈ పనికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. మునిరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కోలుకున్న తర్వాత అతడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man catches fire while trying to burn down his brother’s house. Muniraju was caught on CCTV locking his elder brother’s house, pouring petrol to set it on fire when the accident happened. Neighbours rescued him and he has now been hospitalized. Case registered. pic.twitter.com/E5Yz2R5N9B
— Deepak Bopanna (@dpkBopanna) January 8, 2026
Also Read:
Best City for Women | 2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్ సిటీ ఇదే
Suresh Pasi | ‘ముస్లింల ఓట్లు అవసరం లేదు’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Man Makes Electric Jeep | లక్ష వ్యయంతో.. ఎలక్ట్రిక్ జీప్ తయారు చేసిన వ్యక్తి