లక్నో: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్లు తమకు అవసరం లేదని అన్నారు. తాను ఎప్పుడూ కూడా ముస్లిం ఇళ్లకు వెళ్లి ఓట్లు అడగలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ముస్లింలను ఓట్లు అడగబోనని అన్నారు. (Suresh Pasi) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత, జగదీష్పూర్ ఎమ్మెల్యే సురేష్ పాసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను మసీదులకు ఎప్పుడూ వెళ్ళను. గతంలో వెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా వెళ్ళను. నేను ఓట్లు అడగడానికి వారి ఇళ్ల వద్దకు వెళ్ళను. వారి సుఖదుఃఖాలలో కూడా పాల్గొనను’ అని అన్నారు.
కాగా, ఓట్ల కోసం ముస్లింల ఇళ్లకు తాను వెళ్లబోనన్న సురేష్ పాసి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని అమేథీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ఆరోపించారు. ‘ఎన్నికలు సమీపించినప్పుడల్లా బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తారు. కేవలం ఓట్ల కోసం అన్నదమ్ముల మధ్య, ఒక మతానికి మరో మతానికి, ఒక కులానికి మరో కులానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా నాటకం’ అని మండిపడ్డారు.
మరోవైపు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమని సమాజ్‌వాదీ పార్టీ అమేథీ జిల్లా అధ్యక్షుడు రామ్ ఉదిత్ యాదవ్ విమర్శించారు. ‘హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమే బీజేపీ రాజకీయాలు. సురేష్ పాసి ఆ పార్టీకి చెందినవారు. ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది’ అని ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యే సురేష్ పాసి వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాంశు శుక్లా తెలిపారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ను బీజేపీ నమ్ముతుంది. ఇది పార్టీ స్పష్టమైన వైఖరి. సురేష్ పాసి చెప్పింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం’ అని అన్నారు.
Reporter – Aap Masjid jaate hain?
BJP MLA – Nhi Jaaate hain, Camera par bol rahe hain.
Chad BJP MLA Suresh Pasi Ji 🔥🔥 pic.twitter.com/pajuirikKz
— Aayush. (@ModifiedAayush) January 8, 2026
Also Read:
Contaminated Water | నిన్న ఇండోర్, నేడు నోయిడా.. కలుషిత తాగునీటి వల్ల పలువురు అనారోగ్యం
Best City for Women | 2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్ సిటీ ఇదే
Man Makes Electric Jeep | లక్ష వ్యయంతో.. ఎలక్ట్రిక్ జీప్ తయారు చేసిన వ్యక్తి
Man Killed in Police Firing | పొరుగువారిపై కత్తితో దాడి.. పోలీస్ కాల్పుల్లో వ్యక్తి మృతి