లక్నో: పలు రాష్ట్రాల ప్రజలు కలుషిత తాగునీటి వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి వల్ల 15 మందికిపైగా మరణించారు. తాజాగా ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో కలుషిత తాగునీటి కారణంగా పలువురు అస్వస్థత చెందారు. (Contaminated Water) జనవరి 6, 7 తేదీల్లో డెల్టా 1 సెక్టార్ ప్రాంతంలోని ఆరేడు కుటుంబాలు వాంతులు, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. సీ బ్లాక్లో మురుగునీరు పొంగి ప్రవహిస్తున్నదని, తాగునీటి పైపులైన్లలో లీకేజీ వల్ల నీరు కలుషితమైందని స్థానికులు ఆరోపించారు.
కాగా, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (గ్నిడా) అధికారులు దీనిని ఖండించారు. తాగునీటి సరఫరాలో మురుగునీరు కలువలేదని తెలిపారు. తాగు నీటిని పరీక్షించగా నీరు శుభ్రంగా ఉన్నట్లు తేలిందన్నారు.
మరోవైపు జలవనరుల శాఖ బృందం ప్రభావిత ఇళ్లను సందర్శించి నీటి నమూనాలను పరీక్షించినట్లు గ్నిడా అధికారి తెలిపారు. అయితే నమూనాలు శుభ్రంగా ఉన్నాయని చెప్పారు. ఒక ఇంట్లో సరఫరా కనెక్షన్ సమస్య, మరో ఇంట్లో లీకేజీ సమస్య ఉన్నదని, వాటిని వెంటనే పరిష్కరించినట్లు ఆ అధికారి వెల్లడించారు.
అయితే బుధవారం డెల్టా 1 ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు గౌతమ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ తెలిపారు. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఏడుగురు రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు.
Also Read:
Watch: లారీ డ్రైవర్లను బెదిరించి.. డబ్బులు వసూలు చేస్తున్న మహిళలు
Watch: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటో.. వెనుక వచ్చిన బస్సు, తర్వాత ఏం జరిగిందంటే?
Bengaluru Engineer Dies | 16వ అంతస్తు నుంచి కిందపడి.. ఇంజినీర్ మృతి