కోల్కతా: కొందరు మహిళలు బలవంతంగా లారీలను అడ్డుకున్నారు. మేకులు కట్టిన కర్రలతో లారీ డ్రైవర్లను బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Women Extorting Truck Drivers) గ్రామం మీదుగా వెళ్తున్న భారీ లారీలను ఇద్దరు మహిళలు అడ్డుకున్నారు. మేకులు కట్టిన పొడవైన కర్రలతో లారీ డ్రైవర్లను బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. వాహనాల నంబర్ ఆధారంగా పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది.
కాగా, ఒక వాహనదారుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలు బలవంతంగా లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని కొందరు విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు సాధారణమని కొందరు తెలిపారు. బొగ్గు వంటివి గ్రామాల మీదుగా రవాణా చేసే వాహనాల వల్ల కలిగే దుమ్ము, కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని కొందరు సమర్థించారు.
सड़क पर टोल नहीं, डर की वसूली।
कील हाथ में, कानून गायब।ये कहाँ का नज़ारा है?
सरकार या क़ानून इस पर नज़र क्यों नहीं डाल रहे? pic.twitter.com/Sr35rcDa12
— खुरपेंची ढांचे (@Khurpenchinfra) January 6, 2026
Also Read:
boiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తూ.. గుండెపోటుతో బాలుడు మృతి
train delay triggers protest | 9 కిలోమీటర్ల దూరానికి రెండున్నర గంటలు.. రైలు ప్రయాణికులు ఆగ్రహం
Watch: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటో.. వెనుక వచ్చిన బస్సు, తర్వాత ఏం జరిగిందంటే?