బెంగళూరు: చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. (boiler explosion at sugar factory) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరకుంబి గ్రామంలోని ఇనాందార్ షుగర్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. బాయిలర్ పేలుడు కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేశారు.
Also Read:
Bengaluru Engineer Dies | 16వ అంతస్తు నుంచి కిందపడి.. ఇంజినీర్ మృతి
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తూ.. గుండెపోటుతో బాలుడు మృతి