వెంకటాపూర్, మార్చి 7: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పడమర దిక్కున ఉన్న ఉపాలయం గొల్లాల గుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీనిపై అభ్యంతరాలున్న వారు నేటి నుంచి రెండు నెలల లోపు dg.asi@gov.in మెయిల్‌కు పంపాలని సూచించారు. పాలంపేటలోని స్మారక చిహ్నాల గుర్తింపు ప్రకటన భవిష్యత్ తరాల కోసం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నది.