29న క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్
నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని సింధూ క్యాన్సర్ దవాఖాన సహకారంతో ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- ముందస్తు వైద్యపరీక్ష.. మీ ప్రాణానికి రక్ష
- క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆలస్యం చేయడమే ప్రమాదం
- 40 ఏండ్లు దాటిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, జూలై 26: నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని సింధూ క్యాన్సర్ దవాఖాన సహకారంతో ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ అంటే ఒక నిమిషం భయం..ఆందోళన కానీ భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేయడమే ప్రమాదమన్నారు.
ముందస్తు పరీక్ష మీ ప్రాణానికి రక్ష.. ఒక రోజు సమయం తీసుకొని క్యాన్సర్ స్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఒకో సారి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు కానీ స్రీనింగ్ టెస్ట్‌లో ఆ లక్షణాలు భయటపడతాయని చెప్పారు. 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ ఈ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో కార్పొరేట్ దవాఖానల ఆధ్వర్యంలో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా కొంతమందికి లక్షణాలు ఉన్నట్లు తేలాయని, అప్పటికప్పుడు వారు చికిత్స ప్రారంభించడంతో ప్రాణాలతో భయటపడ్డారని గుర్తుచేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

