బీఆర్ఎస్, టీబీజీకేఎస్లోకి చేరికలు
కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లలో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గులాబీ కండువాలు, టీబీజీకేఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సుజాతనగర్ మండలంలో శనివారం రాత్రి వద్దిరాజు పర్యటించారు.
- కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ వద్దిరాజు
- శ్రేణులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా
- ఈసారి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టీకరణ
కొత్తగూడెం టౌన్/ కొత్తగూడెం సింగరేణి, జూలై 26: కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో పలువురు ప్రజలు, కార్మికులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లలో చేరారు. వీరికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గులాబీ కండువాలు, టీబీజీకేఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సుజాతనగర్ మండలంలో శనివారం రాత్రి వద్దిరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని పలు గ్రామాల నుంచి సుమారు 70 కుటుంబాల వారు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కంగారుబుచ్చయ్య గుంపు నుంచి 10 కుటుంబాలు, రూప్లాతండా నుంచి 40 కుటుంబాలు, చిమ్నాతండా నుంచి 21 కుటుంబాల వారితోపాటు ఆరుగురు వార్డు సభ్యులు చేరారు.
వీరందరికీ ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్తా పాటుపడాలని కోరారు. అలాగే, కొత్తగూడెంలోని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 నుంచి సూపర్వైజర్లు (ఓవర్మెన్లు) బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్లో రవిచంద్ర సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే తమకు ఓవర్మెన్గా ఉద్యోగాలు లభించాయని, కారుణ్య నియామకాలు సహా అనేక హక్కుల వచ్చాయని గుర్తుచేశారు. టీబీజీకేఎస్లో చేరిన వారిలో కార్మికులు గోల్కొండ నవీన్, అలీమ్, సబ్బని వినీత్, వసీం, అజీజ్ తదితరులు ఉన్నారు. అలాగే, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన అనంతరం వద్దిరాజు రవిచంద్ర తొలిసారిగా కొత్తగూడెంలో రావడంతో ఆ పార్టీ స్థానిక నేతలను అయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

