Danam Nagender | హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. ఉప ఎన్నికలకు భయపడి సుప్రీం కోర్టుకు వెళ్లినా దానం నాగేందర్‌కు ఊరట దక్కలేదు. దానం నాగేందర్‌పై అనర్హత వేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తేల్చి చెప్పింది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
2023 నవంబర్ 30: బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి దానం నామినేషన్. డిసెంబర్ 3న గెలుపు.
2024 మార్చి 15: కాంగ్రెస్‌లో చేరిక.
2024 మార్చి 18: దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు పిటిషన్ సమర్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. పదో షెడ్యూల్లోని 2(1)(ఏ), ఆర్టికల్ 191(2), తెలంగాణ శాసనసభ సభ్యుల అనర్హత నిబంధనల కింద పిటిషన్ దాఖలు.
2024 మార్చి 21: లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఖరారు.
2024 ఏప్రిల్ 10: దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ (డబ్ల్యూపీ నంబర్ 9472/2024) దాఖలు చేసిన పాడి కౌశిక్‌రెడ్డి.
2024 జూలై 1: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ దాఖలు.
2024 జూలై 9: స్పీకర్ చర్యలు తీసుకోవడంలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన మహేశ్వర్‌రెడ్డి. బీఆర్ఎస్ ఇతర ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులు కూడా హైకోర్టు ముందుకు.
2024 సెప్టెంబర్ 9: స్పీకర్ కార్యాలయం అనర్హత పిటిషన్లను స్వీకరించి, విచారణకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్ణయించాలని తీర్పు ఇచ్చిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం. నాలుగు వారాల్లో నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) తెలియజేయాలని ఆదేశం.
2024 సెప్టెంబర్ 30: సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన తెలంగాణ శాసనసభ కార్యదర్శి.
2024 నవంబర్ 22: సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు నిర్దిష్ట గడువును విధించే విషయంలో హైకోర్టు జోక్యం పరిమితంగా ఉండాలన్న ధర్మాసనం. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2025 జూలై 31: హైకోర్టు డివిజన్‌బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను 3 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశం.
2025 నవంబర్ 20: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి నోటీసులు. తమ వివరణలను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలన్న స్పీకర్.
2026 జనవరి 29: అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన మహేశ్వర్‌రెడ్డి. బీఆర్ఎస్ బీ-ఫారంతో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ బీ-ఫారంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పదో షెడ్యూల్ ఉల్లంఘనేనని, పార్టీ సభ్యత్వా న్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లుగా పరిగణించడానికి ఆధారమని వాదించారు.
2026 జనవరి 30: దానం నాగేందర్‌పై దాఖలైన రెండు అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి స్వయం గా హాజరై తన వాదనలు వినిపించగా, మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.
2026 మార్చి 11: ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు తగిన, స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ నిర్ణయించారు.
2026 మార్చి 23: స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసి, పదో షెడ్యూల్ లోని 2(1)(ఎ) కింద దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని, 2024 ఏప్రిల్ 23న లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే అమలు కావాలని విజ్ఞప్తి.
2026 ఆగస్టు 21: ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీతో కూడిన డివిజన్ బెంచ్.
2026 సెప్టెంబర్ 18: అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన ధర్మాసనం.
President Murmu | కాంస్యం గెలిచిన భారత మెన్స్ బ్యాడ్మింటన్ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు..!
Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి
Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!