Puri | తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. పూరీ తీరం అల్లకల్లోలం.. రెడ్ ఫ్లాగ్స్ ఎగురవేసిన అధికారులు.. Video
Puri | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Deep Dipression) ప్రభావంతో ఒడిశా (Odisha) లోని పూరీ తీరం (Puri Coast) అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం వైపు కదులుతున్నా కొద్ది పరిస్థితి భయానకంగా మారుతోంది. దాంతో అధికారులు తీరం వెంట ఎర్రజెండాలు (Red flags) ఎగురవేయించారు.
Puri : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Deep Dipression) ప్రభావంతో ఒడిశా (Odisha) లోని పూరీ తీరం (Puri Coast) అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం వైపు కదులుతున్నా కొద్ది పరిస్థితి భయానకంగా మారుతోంది. దాంతో అధికారులు తీరం వెంట ఎర్రజెండాలు (Red flags) ఎగురవేయించారు. బీచ్‌లకు వచ్చిన పర్యాటకులంతా వెంటనే సముద్ర తీరం నుంచి వెళ్లిపోవాలని మైక్‌లలో హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరాన్ని సమీపించే కొద్ది వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, సముద్ర తీరం మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత అధికారులు తీర ప్రాంతాల్లోని దాదాపు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంగళవారం నుంచే ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వాటి తీవ్రత మరింత పెరుగుతున్నది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. అప్పటివరకు గడిచిన 24 గంటల్లో కోరాపుట్ జిల్లాలోని సెమిలిగుడలో అత్యధికంగా 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అదే జిల్లాలోని జైపూర్‌లో 161 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
#WATCH | Puri, Odisha: Red flags hoisted along the sea coast in Puri amid heavy rain forecast. pic.twitter.com/z3Nx10stO9
— ANI (@ANI) September 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

