Rigorous Imprisonment: బాలుడిపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Rigorous Imprisonment: బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మహారాష్ట్రలోని పాల్గర్ కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. డిఫెన్స్ చేసిన వాదనలను కోర్టు కొట్టిపారేసింది. 2020 డిసెంబర్ 12వ తేదీన ఈ లైంగిక దాడి ఘటన జరిగింది.
పాల్గర్: మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష(Rigorous Imprisonment) పడింది. మహారాష్ట్రలోని పాల్గర్ కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. డిఫెన్స్ చేసిన వాదనలను కోర్టు కొట్టిపారేసింది. జన సాంద్రత ఉన్న ప్రదేశంలో ఇలాంటివి జరగవని వాదించినా.. కోర్టు మాత్రం ఆ అభిప్రాయాలను తిరస్కరించింది. బాధితుడి వాంగ్మూలాన్ని తీసివేయలేమని కోర్టు చెప్పింది. స్పెషల్ జడ్జీ ఏహెచ్ కషికార్ తీర్పును ఇస్తూ 41 ఏళ్ల మధు ధర్మ గోవారిని నిందితుడిగా తేల్చాఉ.పాల్గర్ జిల్లాలోని వసాయికి చెందిన అతనిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు బుక్ చేశారు. లైంగిక దాడి జరిగిన సమయంలో బాలుడి వయసు 14 ఏళ్లు మాత్రమే. 2020 డిసెంబర్ 12వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ రోజున ఇంటిపై పావురాలకు దానా వేస్తున్న సమయంలో పక్కింటిలో ఉన్న నిందితుడు ఆ చిన్నారిని బలవంతంగా రూమ్‌లోకి తీసుకెళ్లాడు. చేతులు కట్టేసి, లైంగికంగా వేధించాడు.కానీ చివరకు ఆ బాలుడు అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన సంఘటన గురించి ఇంట్లో వాళ్లకు చెప్పడంతో.. పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. పోక్సో చట్టం కింద నిందితుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధించారు. ఐపీసీలోని 377 సెక్షన్ ప్రకారం పదేళ్ల జైలుశిక్ష పడింది. 30 వేల ఫైన్ వేశారు. ఆ అమౌంట్‌ను బాధితుడికి ఇవ్వాలని ఆదేశించారు. రూల్స్ ప్రకారం బాధితుడికి మరింత ఆర్థిక సాయం చేయాలని స్థానిక అధికారులను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

