చిన్న సైజులో భారీ డేటా లభించే ఫ్లాష్‌డ్రైవ్.. పార్టీ మూడ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే మ్యూజిక్ సిస్టమ్
వీడియో గేమ్ కంట్రోలర్.. చిన్న సైజులో భారీ డేటా లభించే ఫ్లాష్‌డ్రైవ్.. పార్టీ మూడ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే మ్యూజిక్ సిస్టమ్.. అరచేతిలో ఇమిడే అత్యంత శక్తిమంతమైన పవర్ బ్యాంక్ వంటి కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం నయామాల్లో వీటి గురించి అందిస్తున్నాం.
ట్యాబ్లెట్పైనా గేమింగ్..
ట్యాబ్లెట్స్‌లో హై-ఎండ్ వీడియో గేమ్స్ ఆడేవారికి గేమింగ్ కంట్రోలర్లు దొరకడం చాలాకష్టం. ప్రముఖ గేమింగ్ బ్రాండ్ అబ్సిల్యూట్ తీసుకొచ్చిన Abxylute S9v Extendable Game Controller ఉంటే.. ఆ సమస్య ఇట్టే తీరిపోతుంది. పెద్ద స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్లు, ఎక్స్ఆర్ గ్లాసెస్ వాడేవారి కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ కంట్రోలర్ 216 మి.మీ. వెడల్పు వరకూ విస్తరిస్తుంది. ఐప్యాడ్ మినీ, వివిధ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు కూడా దీనిలో సులభంగా ఫిట్ అవుతాయి. ఇది వైర్, వైర్లెస్ మోడ్.. రెండిటినీ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా VITURE XR గ్లాసెస్ వాడేవారికి ఇది పర్ఫెక్ట్ జోడీ. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌ను దీనికి కనెక్ట్ చేసి, గ్లాసెస్ ద్వారా పెద్ద 174 అంగుళాల వర్చువల్ స్క్రీన్ గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఇందులో అదనంగా రెండు ప్రోగ్రామబుల్ బ్యాక్ బటన్లు ఉంటాయి. మీకు నచ్చిన షార్ట్‌కట్స్, కాంబో కీలను వీటికి సెట్ చేసుకోవచ్చు.
– ధర: రూ. 15,330, దొరుకుచోటు: abxylute.com

Abxylute S9v
చిన్న సైజ్‌లో భారీ డేటా
అదనపు డేటా స్టోరేజ్ కావాలా? ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌ను వెంట తీసుకెళ్లడం కష్టంగా ఉందా? అయితే.. సాన్‌డిస్క్ సంస్థ నుంచి వచ్చిన SanDisk Extreme Fit USB-C Flash Driveవైపు ఓ లుక్కేయండి. అత్యంత చిన్న సైజులో లభించే ఈ ఫ్లాష్‌డ్రైవ్.. భారీ డేటాను దాచుకోవడానికి, వేగంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న పరిమాణం కలిగిన ఫ్లాష్ డ్రైవ్‌లలో ఒకటి. చిన్న సైజులో ఉన్నప్పటికీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 64 జీబీ నుంచి మొదలుకొని 1టీబీ వరకు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. యూఎస్బీ 3.2 జెన్1 టెక్నాలజీతో కూడిన ఈ డ్రైవ్.. అద్భుతమైన పనితీరును చూపిస్తుంది. 128 జీబీ నుంచి 1టీబీ వేరియంట్లు 400 ఎంబీపీఎస్ వరకు రీడ్ స్పీడ్ అందిస్తాయి. దీనివల్ల భారీ ఫైళ్లను క్షణాల వ్యవధిలో కాపీ చేసుకోవచ్చు. ఆధునిక ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్స్, ఐపాడ్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో వస్తున్న యూఎస్బీ-సి పోర్ట్స్ కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
– ధర: రూ. 9,999 (512 జీబీ), దొరుకుచోటు: ఫ్లిప్‌కార్ట్

Sandisk Extreme Fit Usb C F
సెలబ్రేషన్స్‌లో నయా వైబ్రేషన్స్!
ఫ్యామిలీతో సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్‌తో గెట్-టు-గెదర్స్, కొలీగ్స్‌తో అవుడ్డోర్ ట్రిప్స్.. పార్టీ ఏదైనా సరే సంగీతం ఉంటే ఆ మజానే వేరు. ప్రముఖ ఆడియో దిగ్గజం జేబీఎల్ రూపొందించిన.. JBL PartyBox On-The-Go 2 ఉంటే, మీ సెలబ్రేషన్స్‌లో వైబ్రేషన్స్ పీక్స్ లెవెకి వెళ్తాయి. మ్యూజిక్ లవర్స్‌కి సరికొత్త పార్టీ అనుభూతిని పంచే ఈ కాంపాక్ట్ సైజు స్పీకర్.. ఏకంగా 100W ఆర్ఎంఎస్ శక్తివంతమైన సౌండ్ వెలువరిస్తుంది. పాట బీట్‌కు తగినట్లుగా రంగులు మారుస్తూ.. డ్యాన్స్ చేసే అద్భుతమైన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ దీని సొంతం. ఇది మీ పార్టీ మూడ్‌ను ఇన్‌స్టంట్‌గా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తుంది. ఈ స్పీకర్‌తో పాటు వైర్లెస్ డిజిటల్ మైక్రోఫోన్లు కూడా వస్తాయి. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 15 గంటల పాటు నిరంతరం సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా, కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే మరో 80 నిమిషాల పాటు ప్లే టైమ్ లభిస్తుంది. అంతేకాకుండా దీని బ్యాటరీని సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.
– ధర: రూ.35,000, దొరుకుచోటు: అమెజాన్

Jbl Partybox
అరచేతిలో పవర్‌హౌజ్!
పని మీద బయటికి వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు.. ల్యాప్‌టాప్, ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే కలిగే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో.. మార్కెట్లోకి ఒక శక్తిమంతమైన, సరికొత్త పవర్ బ్యాంక్‌ను తీసుకువచ్చింది. అదే Lenovo Portable Power Bank with Digital TFT Display. 20,000 ఎంఏహెచ్ భారీ సామర్థ్యం కలిగిన ఈ పవర్ బ్యాంక్.. స్మార్ట్ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్‌లను కూడా పూర్తిగా చార్జ్ చేస్తుంది. ఏకంగా 140W అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ప్రధాన ఆకర్షణ.. దీనిలోని 2.01 అంగుళాల హెచ్డీ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే. దీని ద్వారా పవర్ బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ మిగిలి ఉంది? ఏ పోర్ట్ ద్వారా ఎంత వేగంగా చార్జ్ అవుతున్నది? లాంటి వివరాలను రియల్ టైమ్‌లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌తో ఒకే సమయంలో మూడు పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. దీని లుక్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్‌గా, మాడర్న్‌గా ఉంటుంది.
– ధర: రూ.18,800, దొరుకుచోటు: అమెజాన్

Lenovo Portable Power Bank
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

