అక్రమార్కులకు రేరా రక్షణ!
నగరంలో సొంతింటి కల సామాన్యుడికి పీడకలలా మారుతోంది. పైసా పైసా కూడబెట్టి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి, ఈఎంఐల భారంతో సతమతమవుతూ..
-
సామాన్యుడి కష్టార్జితానికి దొరకని భరోసా
-
సిటీ రియాల్టీలో భారీ మోసాలు
-
బిల్డర్ల అక్రమాలకు కొమ్ముకాస్తున్న అథారిటీ
-
లక్షల రూపాయలు బిల్డర్లకు కట్టబెట్టి రోడ్డెక్కుతున్న జనం
సిటీబ్యూరో/దుండిగల్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : నగరంలో సొంతింటి కల సామాన్యుడికి పీడకలలా మారుతోంది. పైసా పైసా కూడబెట్టి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి, ఈఎంఐల భారంతో సతమతమవుతూ.. జీవితాంతం కష్టపడిన సొమ్మును కొందరు బిల్డర్లు గద్దలా లాగేసుకుంటున్నారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి, వినియోగదారులకు భద్రత కల్పించాల్సిన ‘తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ అలసత్వంతో కొందరు బిల్డర్ల జేబులు నింపుకొంటున్నా..
కళ్లుండి చూడలేని స్థితిలో ‘రేరా’ వ్యవహరిస్తున్నది. దీంతో నగరంలో రియల్టర్ల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. అస్తవ్యస్తంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టాల్సిన రెగ్యులేటరీ అథారిటీ(రేరా), మోసాలకు పాల్పడే బిల్డర్లకు రక్షణ కల్పించే కేంద్రంగా మారింది. అద్దాల మేడలు, అందమైన బ్రోచర్లతో జనాలను బురిడీ కొట్టించే బిల్డర్ల ఆటకట్టించాల్సిన రేరా.. కొందరి అధికారుల తీరుతో కోరలు పీకిన పాముల తయారైంది. కొనుగోలుదారుల రక్షణ దేవుడెరుగు, కండ్ల ముందర జరిగే మోసాన్ని ప్రశ్నించకుండా వ్యవహరిస్తోంది.
రేరా చట్టం ప్రకారం.. తెలంగాణలో కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందనే ఆశలకు నీళ్లొదిలినట్లుగా పరిస్థితికి దిగజారింది. గడిచిన రెండున్నరేండ్ల కాలంలో కేవలం ఫిర్యాదులు వస్తే గానీ నోటీసులు జారీ చేయని అథారిటీ, బాధితులకు ఇప్పటి వరకు న్యాయం చేసింది లేదు. గతంలో రేరాకు ఫిర్యాదు వచ్చిందంటే కొనుగోలుదారులు తమకు న్యాయం జరుగుతుందనే భరోసా ఉండేది. కానీ ఇప్పుడు బిల్డర్లకు కొమ్ము కాస్తున్న అథారిటీలోని కొందరు సభ్యులతో రేరా ప్రతిష్ట మసక బారుతోంది.
వాసవి అర్బన్ బాధితుల ఆవేదన
బాచుపల్లిలోని వీఎన్ ఆర్ కళాశాల పకన ‘వాసవీ అర్బన్’ నిర్మాణ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. సుమారు 3 వేల మంది కస్టమర్ల వద్ద ఒకొకరి నుంచి రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 1,500 కోట్ల వరకు వసూలు చేసింది. ఫ్లాట్ల పూర్తి ధరతో పాటు మౌలిక సౌకర్యాల కోసం అదనంగా మరో రూ. 2 లక్షలు చెల్లించిన కొనుగోలుదారులు సొంతింటి కోసం ఆరేండ్లుగా ఎదురుచూస్తున్నారు. 2024లోనే పూర్తి చేసి అప్పగిస్తామన్నయాజమాన్యం.. ఇప్పటివరకు ఏడుసార్లు మాట తప్పి, ఈ ఏడాది ఆగస్టు వరకు అంటూ కాలయాపన చేస్తూనే ఉంది.
ఒకవైపు ఈఎంఐలు, మరోవైపు పిల్లల ఫీజులు, ఇళ్ల అద్దెలు చెల్లించలేక విలవిల్లాడుతున్న కొనుగోలుదారులు భరించలేక ప్రాజెక్టు ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ కొనుగోలుదారులకు భరోసానివ్వాల్సిన మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ దురుసుగా వ్యవహరించి, బెదిరింపులకు దిగడంతో తమ డబ్బులకు రక్షణేదనీ లబోదిబోమంటున్నారు. అడ్డగోలు గడువులతో కాలం వెల్లదీస్తున్నా వాసవీ నిర్మాణ సంస్థ… తమకు ఇండ్లను అప్పగించకుండా శాశ్వత పరిషార మార్గం చూపడం లేదు. గతంలో రేరాను ఆశ్రయించి, కేవలం నామమాత్రపు జరిమానాలతో చేతులు దులుపుకొన్నారే తప్ప, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయించడంలో రేరా విఫలమైంది.
సాస్ ఇన్ఫ్రా నుంచి వాసవీ వరకు..
కేవలం వాసవి అర్బన్ మాత్రమే కాదు.. ఇటీవల ‘సాస్ ఇన్ఫ్రా’ వంటి సంస్థలు సైతం రేరా నిబంధనలను పూర్తిగా తుంగలో తొకి సామాన్యుడి కష్టార్జితానికి రక్షణ లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల కొనుగోలుదారుల సొమ్ము కనుమరుగవుతున్నా, అథారిటీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాస్ ఇన్ ఫ్రా ఐ టవర్స్ వంటి ఇతర అక్రమ నిర్మాణాల విషయంలోనూ బిల్డర్లకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలుదారులు మోసపోతున్నా, బిల్డర్లకు కొమ్ముకాస్తున్న కొందరు రేరా సభ్యుల తీరుతో బాధితులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
మోసాలపై నియంత్రణేది?
రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలను గుర్తించి, కొనుగోలుదారుల హకులను పరిరక్షించాల్సిన రెగ్యులేటరీ అథారిటీ చేష్టలుడిగి కూర్చుంటే నగరంలో రియల్ పెట్టుబడులకు భద్రత లేకుండా పోయింది. చట్టాలు పకడ్బందీగా ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాల్సిన అధికారుల ఉదాసీనత బిల్డర్లకు కలిసి వస్తుంది. రేరా అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు సభ్యుల అక్రమాలతో నగరంలో వేలాది మంది మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలలు పీడకలలుగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి, సంబంధిత అధికార యంత్రాంగంపై చర్యలకు ఆదేశించాలి. నిబంధనలను పాటించని మోసపూరిత నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ న్యాయం చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అడ్డుఅదుపు లేకుండా సాగే బిల్డర్ల మోసాలతో సామాన్యుడి సొమ్ముకు భద్రతా లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

