Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Newborn dies due to DJ Sound | విగ్రహం ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనం ఒక ఇంటి ముందు ఆగింది. అయితే డీజే శబ్దం హోరుకు ఆ ఇంట్లో ఉన్న నవజాత శిశువు గుండె ఆగింది. అచేతనమైన ఆ శిశువును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
లక్నో: విగ్రహం ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనం ఒక ఇంటి ముందు ఆగింది. అయితే డీజే శబ్దం హోరుకు ఆ ఇంట్లో ఉన్న నవజాత శిశువు గుండె ఆగింది. అచేతనమైన ఆ శిశువును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Newborn dies due to DJ Sound) ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 రోజుల కిందట ఆడ బిడ్డను ప్రసవించిన రీమా దేవి కాన్పు తర్వాత ముడియారి గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. పది రోజులుగా నవజాత శిశువుతో కలిసి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నది.
కాగా, ఆ గ్రామంలో దేవతా విగ్రహం నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఒక వాహనంపై డీజే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రీమా దేవి ఉంటున్న ఇంటి వద్ద ఆ వాహనం ఆగింది. ఆ ఇంట్లోని తల్లి పక్కన నిద్రిస్తున్న 20 రోజుల నవజాత శిశువు, డీజే సౌండ్ హారుకు ఉలిక్కిపడి పెద్దగా ఏడ్చింది. గుండె ఆగిపోవడంతో కదలకుండా ఉండిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆ నవజాత శిశువు మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు ఆ శిశువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నవజాత శిశువు ఉన్నదని, డీజే శబ్దాన్ని తగ్గించమని, ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించాలని పదేపదే కోరినప్పటికీ డీజే నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ ఉన్న ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా నవజాత శిశువు మరణానికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు చేపడతామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

