NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకుడు గుర్రాల నాగరాజు అన్నారు.
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా : దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకుడు గుర్రాల నాగరాజు అన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 14 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు కోర్ కమిటీ సమావేశం నాగరాజు గుర్రాల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా కోర్ కమిటీ సభ్యులందరూ పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. నాడు కేసీఆర్చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. ఆ దీక్షా ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందనే చారిత్రక సత్యాన్ని భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ బిగాల ఆన్లైన్ ద్వారా పాల్గొని కోర్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
దీక్షా దివస్ చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ, 14 రోజుల కార్యక్రమాల లక్ష్యాలు, నిర్వహణ, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు చేరవేయడంపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మేడసాని, హరీశ్ రంగ, అరవింద్ చీకోటి, కిరణ్ కుమార్ బెల్లి, సాయి కిరణ్ నల్ల, సౌజన్ రావు, రాంబాబు, వురే వంశీ, వెంకట్ రావు తల్లపల్లి, నవదీప్ రెడ్డి, రంజిత్, బాలు, విజయ్ జుంజూర్, సుమన్ పోరండ్ల, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితర కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
Bihar | బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

