Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం( Scorpio vehicle)అదుపుతప్పి వంతెనపై(Bridge) నుంచి లోతైన కాలువలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు(Six people died )కోల్పోయారు.
Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం( Scorpio vehicle)అదుపుతప్పి వంతెనపై(Bridge) నుంచి లోతైన కాలువలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు(Six people died )కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన అరారియా జిల్లాలోని తారాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. సుపౌల్ జిల్లా పిప్రా ప్రాంతంలోని థుమ్హా గ్రామానికి చెందిన ఏడుగురు స్కార్పియోలో సిక్టీ ప్రాంతంలోని భప్టియా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో బీడీ వంతెన వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు దగ్గర వాహనం అదుపుతప్పి నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అప్పటికే ఆరుగురు మరణించినట్లు అరేరియాలోని సదర్ దవాకానకు చెందిన డాక్టర్ నీరజ్ కుమార్ తెలిపారు. మృతులను యశ్ కుమార్ (15), ఆదిత్య ఆనంద్ (18), ఆర్యన్ (15), కుందన్ కుమార్ (26), సౌరభ్ (16), మున్నా కుమార్ (14)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారు.అప్పటి వరకు పెళ్లి వేడుకల్లో సంతోషంగా పాల్గొన్న వారు విగతజీవులుగా మారడంతో ప్రమాద వార్తతో థుమ్హా గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- bridge
- Canal
- Road Accident
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

