అటు వృథా..ఇటు కలుషితం..
మంచినీటిని వృథా చేయకండి.. రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రతిరోజూ జలమండలి అధికారులు ప్రచారం చేస్తున్నారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 18: మంచినీటిని వృథా చేయకండి.. రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రతిరోజూ జలమండలి అధికారులు ప్రచారం చేస్తున్నారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జలమండలి మెయింటెనెన్స్ విభాగం నిర్లక్ష్యంతో పలు బస్తీలు, కాలనీల్లో మంచినీరు వృథాగా రోడ్లపై పారుతున్నా..పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని ఐఏఎస్ క్వార్టర్స్ ఎదురుగా సింగాడకుంట వైపువెళ్లే రోడ్డుపై ప్రధాన రహదారిపై వాల్వ్‌లో నిత్యం మంచినీళ్లు పారుతుండడంతో రోడ్డుమొత్తం కోతకు గురయిందంటే ఎంతమేర వృథా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఎన్బీటీనగర్, ఎన్బీనగర్, ఎమ్మెల్యే కాలనీ ప్రాంతాల్లో కనీసం 10 వాల్వ్‌ల వద్ద మంచినీరు లీకవుతోందని స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయితే సిబ్బంది కొరతను సాకుగా చూపి ఎక్కడా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని శ్రీరాంనగర్, బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆశా ఆస్పత్రి సమీపంలో నల్లాలు వదిలినప్పుడల్లా వాల్వ్‌ల నుంచి నీరు లీకవడం సర్వసాధారణమైన విషయంగా మారింది.
రంగు మారిన తాగునీరు!
ఆర్కేపురం, నవంబర్ 18 : డాక్టర్స్ కాలనీ డివిజన్ జింకలబావి కాలనీలో కొన్ని నెలలుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. ఈ విషయమై జలమండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు మండిపడుతున్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

