గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఉధృతం
పశ్చిమాసియా మళ్లీ రాజుకుంటున్నది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బుధవారం తన పొరుగు గల్ఫ్ దేశాలపై దాడులను విస్తరించింది. కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై కాల్పులు జరిపిన ఇరాన్, బహ్రెయిన్‌పై పలుమార్లు దాడులు చేసింది.
- కువైట్, బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యం
కైరో, నవంబర్ 18 : పశ్చిమాసియా మళ్లీ రాజుకుంటున్నది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బుధవారం తన పొరుగు గల్ఫ్ దేశాలపై దాడులను విస్తరించింది. కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై కాల్పులు జరిపిన ఇరాన్, బహ్రెయిన్‌పై పలుమార్లు దాడులు చేసింది. డ్రోన్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ సైన్యం తెలిపింది. దేశ భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారిన ఇరాన్ దాడులను ‘నేరపూరితమైనవి’గా కువైట్ విదేశాంగ శాఖ విమర్శించింది.కువైట్‌లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై బుధవారం తెల్లవారుజామున ఇరాన్ దాడి చేసింది.
ఈ దాడిలో, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్, క్షిపణి ప్రయోగ వేదికలను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్టు ఆ దేశ ప్రభుత్వ ప్రసార సంస్థ వెల్లడించింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత, ఇటీవల కొద్ది రోజులుగా బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలనే ఇరాన్ పదేపదే లక్ష్యంగా చేసుకుంటున్నది. పర్షియన్ గల్ఫ్‌లోని చిన్న ద్వీప రాజ్యమైన బహ్రెయిన్‌లో అమెరికాకు చెందిన 5వ నౌకాదళం ఉంది. హొర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో రివల్యూషనరీ గార్డ్ క్షిపణి ప్రయోగ కేంద్రంపై అమెరికా యుద్ధ విమానం మంగళవారం దాడి చేసిన తర్వాతే ఈ దాడులు జరిగాయి. అంతకుముందు బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ కేంద్రంపై ఇరాన్ దాడి చేయడంతో, ప్రతీకారంగానే అమెరికా దాడి చేసిందని అధికారులు తెలిపారు.
కాలం చెల్లిన క్షిపణులతో అమెరికా దాడులు
ఇరాన్‌తో యుద్ధంలో గడువు ముగిసిన తొమహాక్ క్రూయిజ్ క్షిపణులు సహా వినియోగానికి పనికిరానివిగా గుర్తించిన మందుగుండు సామగ్రిని అమెరికా నావికా దళం వాడినట్టు నావికా దళం తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో వెల్లడించారు. కావో తన నియామక ఆమోద విచారణ కోసం ఈ నెల 17న సెనేట్ సాయుధ సేవల కమిటీ ఎదుట హాజరై, ఈ వివరాలను తెలిపారు. దీంతో అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి, కచ్చితమైన దాడులకు ఉపయోగించే క్షిపణుల కొరత పెరుగుతుండటం, పాత క్షిపణులపై ఆధారపడటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గడువు ముగిసినవిగా లేదా వినియోగానికి పనికిరానివిగా వర్గీకరించిన మందుగుండు సామగ్రిని నావికా దళం తీసుకుని, వాటి ఆపరేషన్ కోడ్లను మార్చి మళ్లీ వాడిందని కావో తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వీటిని వినియోగించినట్టు చెప్పారు. ఇరాన్‌తో యుద్ధంలో మొదటి నాలుగు వారాల్లో అమెరికా సైన్యం 850కు పైగా తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని మీడియా పేర్కొంది. యుద్ధ చర్యలకు విరా మం ఇచ్చిన నాటికి వెయ్యికి పైగా క్షిపణులు ఖర్చయ్యాయని ఏప్రిల్ 21న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా వేసింది. తొమహాక్లు ఖరీదైనవి (ఒక్కో క్షిపణి ధర 3.6 మిలియన్ డాలర్ల వరకు ) కావడం, తయారీకి చాలా సమయం పట్టడం వల్ల ఈ వినియోగ స్థాయి ఆందోళన కలిగిస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

