Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
Massive Donation | తిరుమల చరిత్రలో మున్నెన్నడు లేని విధంగా ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) చరిత్రలో మున్నెన్నడు లేని విధంగా ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళాన్ని ( Massive Donation ) అందజేశారు. చెన్నైకి చెందిన వర్దమాన జైన్ ( Vardamana Jain) అనే భక్తుడు సుమారు రూ.206 కోట్ల విలువగల 121 కిలోల శ్రీవారికి అలంకరిచే అన్ని రకాల అభరణాలు ( Gold Ornaments ) తయారు చేయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.
గతంలోను 2025 జనవరిలో రూ.6 కోట్లు విరాళాన్ని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరి , ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి దంపతులకు ఆలయం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు, వేదాశీర్వాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్వామివారికి రూ.206 కోట్లు విరాళంగా ఒక భక్తుడు ఇవ్వడం చరిత్ర అని కొనియాడారు. తిరుమల శ్రీవారి వైభవం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. తిరుమల అంటే భక్తి,విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అటవీ నిబంధనలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Massive Donation | తిరుమల శ్రీవారికి భారీ విరాళం..రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత
ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : సీఈఓ నాగలక్ష్మి
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
Vaibhav Sooryavanshi | పిజ్జాకు దూరం.. రోజుకు 600 బంతుల ప్రాక్టీస్.. వైభవ్ సూర్యవంశీ ట్రైనింగ్, న్యూట్రిషన్ సీక్రెట్స్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

