Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
Tarnaka traffic jam | తార్నాక మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతుండటంతో అత్యవసర సేవలందించే అంబులెన్సులు కూడా ముందుక వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది.
Tarnaka traffic jam | హైదరాబాద్ : తార్నాక ప్రధాన రహదారిపై భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేబుల్ పనుల కోసం రోడ్డు తవ్వకాలు చేపట్టిన కారణంగా వాహన రాకపోకలు నెమ్మదించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తార్నాక మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనివల్ల ఉదయం వేళల్లో ఉద్యోగులు సరైన సమయానికి కార్యాలయాలకు చేరుకోలేక, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతుండటంతో అత్యవసర సేవలందించే అంబులెన్సులు కూడా ముందుక వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఎమర్జెన్సీ వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ తవ్వకాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు.
Read Also :
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tarnaka traffic jam | రోడ్డు తవ్వకాలతో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో
Vaibhav Sooryavanshi | పిజ్జాకు దూరం.. రోజుకు 600 బంతుల ప్రాక్టీస్.. వైభవ్ సూర్యవంశీ ట్రైనింగ్, న్యూట్రిషన్ సీక్రెట్స్ తెలుసా?
ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల రద్దు కోరుతూ తల్లిదండ్రుల ఆందోళన
‘విధులకు గైర్హాజరైతే కుటుంబానికే కాదు.. సంస్థ మనుగడకూ నష్టం’
Chris Gayle | వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో.. వైభవ్ అద్భుత ప్రదర్శనపై క్రిస్ గేల్ ఆశ్చర్యం..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

