Chris Gayle | వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో.. వైభవ్ అద్భుత ప్రదర్శనపై క్రిస్ గేల్ ఆశ్చర్యం..!
Chris Gayle | భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్టు-ఎ క్రికెట్లో ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌పై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులో కేవలం 53 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం చూసి తాను మొదట అది టీ20 మ్యాచ్ అనుకున్నానని గేల్ నవ్వుతూ అన్నాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా వైభవ్ సృష్టించిన ఈ సునామీ ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
Chris Gayle : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్టు-ఎ క్రికెట్లో ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌పై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులో కేవలం 53 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం చూసి తాను మొదట అది టీ20 మ్యాచ్ అనుకున్నానని గేల్ నవ్వుతూ అన్నాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా వైభవ్ సృష్టించిన ఈ సునామీ ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఈ నెల 24న దోహా వేదికగా యూఏఈతో జరిగిన లిస్టు-ఎ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో అజేయంగా 204 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 384.90 కావడం గమనార్హం. కేవలం 16 బంతుల్లో అర్ధ శతకం, 28 బంతుల్లో సెంచరీ, 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
యూఏఈ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని వైభవ్ ధాటితో భారత్-ఎ జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వైభవ్ ఇన్నింగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. “వైభవ్ ఇన్నింగ్స్ గురించి నా ఫోన్‌కి వరుసగా మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. డబుల్ సెంచరీ, అదీ 28 సిక్సర్లతో కొట్టడం అంటే అసాధారణం. అసలేం జరుగుతోందనిపించింది. 12 ఓవర్లలోనే డబుల్ సెంచరీ అని ఎవరో చెబితే, అది టీ20 మ్యాచా..? అని అడిగాను. కానీ వాళ్లు అది 50 ఓవర్ల మ్యాచ్ అని చెప్పడంతో నేను షాకయ్యా” అని అన్నాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూస్తే 50 ఓవర్ల ఫార్మాట్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో అనిపిస్తున్నదని గేల్ వ్యాఖ్యానించారు. వైభవ్ ఆట స్వరూపాన్నే మార్చేస్తున్నాడని ప్రశంసించారు. ఇలాంటి ప్రతిభ కనుమరుగు కాకుండా అతనికి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు రావాలని గేల్ ఆశాభావం వ్యక్తంచేశాడు.
అదేవిధంగా తన ‘యూనివర్స్ బాస్’ పేరుతో పోలుస్తూ వస్తున్న ‘బేబీ బాస్’ అనే నిక్నేమ్పై స్పందిస్తూ.. అతను తనకంటూ ఒక సొంత పేరు, బ్రాండ్ సృష్టించుకోవాలని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని వైభవ్‌కు గేల్ సూచించాడు. కాగా 2026 ఐపీఎల్‌లోనూ వైభవ్ సూర్యవంశీ రికార్డులు సృష్టించాడు. తాజా ఇన్నింగ్స్‌తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chris Gayle | వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో.. వైభవ్ అద్భుత ప్రదర్శనపై క్రిస్ గేల్ ఆశ్చర్యం..!
Demolitions | రేవంత్ రెడ్డి గంట పర్యటన కోసం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత ఫైర్
వైరాలో టిప్పర్ ఢీకొని మహిళ మృతి
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

