Demolitions | రేవంత్ రెడ్డి గంట పర్యటన కోసం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత ఫైర్
50 కుటుంబాలకు మున్సిపాలిటీ సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇయ్యకుండా తీస్తరా తీయరా అని బెదిరింపులకు గురి చేసి కొందరు డబ్బాలు తీసేశారు.. మరికొందరు తీయమని ఎదురుతిరిగితే అర్థరాత్రి ఒంటిగంటకు పోలీసుల బందోబస్తు పెట్టి జేసీబీలతో షాపులు కూల్చేశారని మండిపడ్డారు.
Demolitions | రేవంత్ రెడ్డి అచ్చంపేట సభ నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం పాత ఆర్టీసీ డిపో వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 50 మంది పేదల షాపులను తొలగించడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఫైర్ అయ్యారు. జేఏసీ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డుపై వీళ్లంతా గత 10-15 సంవత్సరాలుగా షాపులతో ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు.. చికెన్, మటన్‌షాపు, కిరాణ కొట్టు, బట్టల షాపుల ఇతర షాపులు నడిపించుకుంటూ 50 కుటుంబాలు జీవిస్తున్నారు.
50 కుటుంబాలకు మున్సిపాలిటీ సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇయ్యకుండా తీస్తరా తీయరా అని బెదిరింపులకు గురి చేసి కొందరు డబ్బాలు తీసేశారు.. మరికొందరు తీయమని ఎదురుతిరిగితే అర్థరాత్రి ఒంటిగంటకు పోలీసుల బందోబస్తు పెట్టి జేసీబీలతో షాపులు కూల్చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిని అడుగుతున్నా.. మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. పొద్దున లేస్తే ప్రజా పాలన అంటరు.. ముఖ్యమంత్రి వచ్చే గంట పర్యటన కోసం హెలిప్యాడ్ దించడానికి 50 కుటుంబాల జీవితాల మీద మన్ను పోస్తున్నరని ఫైర్ అయ్యారు.
ఇదెక్కడి న్యాయం.. ప్రజా పాలన అన్నప్పుడు ప్రజలకు ఏం ఇవ్వాల్నో అది ఇవ్వాలి కదా.. వాళ్లకు మీరు ఉపాధి కల్పించకపోయినా అప్పు చేసి వాళ్ల కుటుంబాలను నడిపించుకోవడం కోసం ఐరన్ షాపు, కటింగ్ షాపు, మటన్ కొట్టు బతుకుతున్నరు.. మీరు వాళ్ల జీవితాలను రుణాలు ఇచ్చి సాయం చేయాల్సి పోయి జీవితాలనుఆగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కోసం 50 షాపులను తొలగించి హెలిప్యాడ్ నిర్మాణం
రేవంత్ రెడ్డి అచ్చంపేట సభ నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం పాత ఆర్టీసీ డిపో వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 50 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల షాపులు రాత్రికి రాత్రి తొలగింపు
రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కోసం పేదల పొట్ట మీద కొట్టడం దారుణమని నిలదీసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2026
Read Also :
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Demolitions | రేవంత్ రెడ్డి గంట పర్యటన కోసం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత ఫైర్
వైరాలో టిప్పర్ ఢీకొని మహిళ మృతి
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

