ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల రద్దు కోరుతూ తల్లిదండ్రుల ఆందోళన
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని ములకలపల్లి మండలం జగన్నాథపురం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గురువారం వారు జగన్నాథపురం పాఠశాల...
– ఇప్పటికే ముగ్గురు టీచర్లు ఇతర పాఠశాలలకు బదిలీ
– తాజాగా ఇంగ్లీష్ మీడియం సోషల్ టీచర్‌ను డిప్యుటేషన్‌పై పంపడంపై నిరసన
ములకలపల్లి, నవంబర్ 26 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని ములకలపల్లి మండలం జగన్నాథపురం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గురువారం వారు జగన్నాథపురం పాఠశాల హెచ్ఎం వెంకటనర్సమ్మ కు వినతిపత్రం అందజేశారు. జగన్నాథపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నాణ్యమైన విద్య, మంచి ఉపాధ్యాయులు ఉన్నారనే నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్పించినట్లు తెలిపారు. అయితే, ఇటీవల డిప్యుటేషన్ పేరుతో ఒక్కొక్కరిగా ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు పంపడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ పాఠశాల నుండి ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై బయటకు పంపించారని, తాజాగా ఇంగ్లీష్ మీడియం సోషల్ టీచర్‌ను కూడా డిప్యుటేషన్‌పై పంపడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇలాంటి కీలక సమయంలో ఉపాధ్యాయులను బదిలీ చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్ అంధకారంలో పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోయారు. పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవడం సరైన పద్ధతి కాదని వారు స్పష్టం చేశారు. తమ పిల్లల చదువుకు నష్టం కలగకుండా ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేసి, వారిని ఇదే పాఠశాలలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల రద్దు కోరుతూ తల్లిదండ్రుల ఆందోళన
‘విధులకు గైర్హాజరైతే కుటుంబానికే కాదు.. సంస్థ మనుగడకూ నష్టం’
Chris Gayle | వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో.. వైభవ్ అద్భుత ప్రదర్శనపై క్రిస్ గేల్ ఆశ్చర్యం..!
Demolitions | రేవంత్ రెడ్డి గంట పర్యటన కోసం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత ఫైర్
వైరాలో టిప్పర్ ఢీకొని మహిళ మృతి
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

