అతి వేడిగా తాగొద్దు..
ఆవిర్లు కక్కుతున్న వేడివేడి టీ లేదా కాఫీని ఓ గుటక వేస్తే.. మనసుకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా ఉన్న అలసట ఇట్టే మాయమై పోతుంది. మెదడు ఉత్సాహంగా తయారవుతుంది. అయితే, ఈ ఆనందం వెనుక ఓ ఆరోగ్య ముప్పు కూడా దాగి ఉంది. వేడివేడి టీ, కాఫీలను తాగే అలవాటు..
ఆవిర్లు కక్కుతున్న వేడివేడి టీ లేదా కాఫీని ఓ గుటక వేస్తే.. మనసుకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా ఉన్న అలసట ఇట్టే మాయమై పోతుంది. మెదడు ఉత్సాహంగా తయారవుతుంది. అయితే, ఈ ఆనందం వెనుక ఓ ఆరోగ్య ముప్పు కూడా దాగి ఉంది. వేడివేడి టీ, కాఫీలను తాగే అలవాటు.. మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలపై ప్రభావం చూపుతుంది. ప్రాణాంతకమైన అన్నవాహిక క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.
సాధారణంగా మానవ శరీరం 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కానీ, ఇళ్లలో, హోటళ్లలో అందించే టీ, కాఫీలు 65 డిగ్రీల నుంచి 70 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉంటాయి. అంతటి వేడి పానీయాలు గొంతు కిందికి వెళ్లేటప్పుడు, అన్నవాహిక గోడలపై ఉండే సున్నితమైన మ్యూకోసా కణాలను దెబ్బతీస్తాయి. ఇలా ఒకసారితో ఆగిపోకుండా.. ప్రతిరోజూ వేడివేడిగా టీ, కాఫీలు తాగడం వల్ల అన్నవాహిక పొరలు నిరంతరం కాలిపోతూ, మళ్లీ మానుతూ ఉంటాయి. ఈ పునరావృత గాయాల వల్ల కణాల పునరుత్పత్తి జరిగేటప్పుడు జన్యుపరమైన లోపాలు ఏర్పడతాయి. ఇవే కాలక్రమేణా క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ..
ఈ అంశంపై విస్తృతమైన అధ్యయనం నిర్వహించింది. 65 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన పానీయాలను తీసుకోవడం వల్ల మనుషులలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ తేల్చింది. ఈ క్రమంలోనే అతి వేడిగా ఉండే పానీయాలను ‘గ్రూప్ 2ఏ కార్సినోజెన్స్’ జాబితాలో చేర్చింది. అంటే ఇవి మనుషుల్లో క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఉన్న పదార్థాల కోవలోకి వస్తాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. టీ లేదా కాఫీలో క్యాన్సర్‌కు కారణమ్యే రసాయనాలు ఉన్నాయని కాదు. వాటిని వేడివేడిగా తీసుకోవడమే అసలు సమస్య. దీనికి ఇతర ముప్పుకారకాలు కూడా తోడైతే.. ప్రమాదం రెట్టింపు అవుతుంది. చాలామంది వేడి టీ, కాఫీలు తాగుతూ.. ధూమపానం కూడా చేస్తుంటారు. ఇలాంటి వారిలో అన్నవాహిక క్యాన్సర్ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందట.
Read Today's Latest Events News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

