పోరాట యోధుడు చంద్రప్రకాశ్‌రావు
నిజాం వ్యతిరేక పోరాటంలో యోధుడు. రక్షకభట పునర్నిర్మాణ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన పోలీస్ అధికారి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ప్రతిభావిత్వమైన వ్యక్తిత్వాన్ని దైవదత్తంగా తెచ్చుకున్న మహానుభావుడు కేశరాజు చంద్ర ప్రకాశ్‌రావు. సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఆయన ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని, సమాజానికి అందించిన సేవలను స్మరించుకుందాం.
నిజాం వ్యతిరేక పోరాటంలో యోధుడు. రక్షకభట పునర్నిర్మాణ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన పోలీస్ అధికారి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ప్రతిభావిత్వమైన వ్యక్తిత్వాన్ని దైవదత్తంగా తెచ్చుకున్న మహానుభావుడు కేశరాజు చంద్ర ప్రకాశ్‌రావు. సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఆయన ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని, సమాజానికి అందించిన సేవలను స్మరించుకుందాం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత హైదరాబాద్ సంస్థానాధీశుడు నిజాం రాజు తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో కలపటానికి నిరాకరించినందున కేంద్ర ప్రభుత్వం సైనికచర్య ద్వారా అతనిని లొంగదీసుకున్నది. హైదరాబాద్ రాష్ర్టానికి రాజ్ ప్రముఖ్‌గా నియమించింది. ఇందుకు వ్యతిరేకంగా తెలంగాణలో విద్యార్థుల ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. అప్పుడు హనుమకొండలో విప్ల వ నాయకుడైన హయగ్రీవాచారి వద్ద ఉండి ఏడో తరగతి చదువుతున్న చంద్రప్రకాశ్‌రావు, తన గురువు ఉద్యమాలతో ప్రభావితుడై సుమారు ఒక దశాబ్దంపాటు జరిగిన ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించారు. నిజాం ప్రభుత్వాగ్రహానికి గురై అనేకసార్లు కారాగారవాసం, లాఠీచార్జీలు, కఠిన శిక్షలు అనుభవించారు.
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ తొలి సెషన్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఇచ్చిన పిలుపు మేరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సర్కార్ వెలువరించిన ఫర్మానాను తుంగలో తొక్కి జాతీయ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వాన హనుమకొండలో అన్ని ప్రధానమైన కూడళ్లలో సెప్టెంబర్ 2న త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నినాదాలు ఇస్తూ జరిపిన ఊరేగింపులో ప్రధాన పాత్ర ఆయనదే. కాంగ్రెస్ కార్యకర్తల వెంట శరణార్థుల సహాయ చర్యల్లో ఆయన పనిచేశారు. జమలాపురం కేశవరావు, కాళోజీ నారాయణరావు, దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి ఎంతో మంది ఉద్యమకారులు, మేధావుల సమకాలీకుడు చంద్రప్రకాశ్‌రావు. ఆయనను నిజాం పోలీసులు బందించి, లారీలో చల్వాయి, అక్కడి నుంచి లక్నవరం చెరువు వరకు తీసుకెళ్లి అక్కడ కీకారణ్యంలో వదిలివేశారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడు, ఉద్యమంలో పనిచేసినప్పుడు ఉద్యమ నాయకుడుగా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మొట్టమొదటగా పోలీస్ అధికారుల సంఘాన్ని స్థాపించారు. పెన్షనర్ల సంఘానికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. పోలీసు ఉద్యోగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్టపతి పతకం సహా అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తూ ముఖ్యమంత్రులకు, నాటి ప్రభుత్వాలకు అత్యంత చేరువగా ఉండేవారు.
గ్రామం ఒక సంస్థ. దేవాలయం ఒక ఉప సంస్థ. ఈ రెండింటికీ గ్రామ వ్యవస్థ మన దేశంలో ఏర్పడినప్పటి నుంచి అవినాభావ సంబంధం ఉన్నది. ఆయన ఉద్యోగరీత్యా పట్టణాల్లో ఉన్నా సమయం దొరికినప్పుడల్లా తన స్వగ్రామమైన మొదిమతుర్తికి వెళ్తూ తన పరపతిని, పరిచయాలను వినియోగించుకొని గ్రామంలో విద్యుత్తు, నీరు, రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కృతకృత్యులయ్యారు. గ్రామ ప్రజలందరినీ ప్రోత్సహించి వారందరి సహాయ సహకారాలతో కోదండ రామాలయాన్ని ప్రతిష్టింపజేయడం, ఆలయానికి నిత్య పూజా నిమిత్తం ఆచార్యులను నియమింపజేయటం, వారికి గృహవసతి ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ ఆయనతోపాటు అతని అన్నయ్య కూడా ప్రధానపాత్ర వహించారు. మానవుని ప్రవర్తన…అది వ్యక్తిగతమైనా, సాంఘికమైనా, రాజకీయమైనా, ఆర్థికమైనా దానికి నీతి ప్రాతిపదిక కావాలనేది చంద్ర ప్రకాశ్‌రావు మాటల్లో తెలిసేది. మహానుభావులకు మరణం లేదు. మనందరికీ స్మృతిపథంలో చిరంజీవులుగా ఉంటారు. వారి జీవిత విశేషాలను సంస్మరించటం మాత్రమే కాక, వాటిని మనలో పునర్జ్వలింప చేసుకోవడం జరిగినప్పుడే వాటికి సార్థకం.
వేముగంటి శుక్తిమతి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

