రగ్గులా..తగ్గేదే లేదు!
శీతకాలం మొదలయిపోయింది. కబోర్డులో దాచిన స్వెటర్లు తీసే టైం వచ్చింది. రాత్రుళ్లు వెచ్చదనం కోసం కప్పుకోవడానికి రగ్గులు కూడా ఉన్నాయి. కానీ, పొద్దున్నే లేచి కాలు కింద పెట్టాలంటే ఫ్లోర్ చల్లగా తగులుంది. అలాగే తడి కాళ్లతో తిరగాలంటే అస్సలు వీలు కాదు. అందుకే ఇప్పుడు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు ఇంటీరియర్ డిజైనర్లు.
శీతకాలం మొదలయిపోయింది. కబోర్డులో దాచిన స్వెటర్లు తీసే టైం వచ్చింది. రాత్రుళ్లు వెచ్చదనం కోసం కప్పుకోవడానికి రగ్గులు కూడా ఉన్నాయి. కానీ, పొద్దున్నే లేచి కాలు కింద పెట్టాలంటే ఫ్లోర్ చల్లగా తగులుంది. అలాగే తడి కాళ్లతో తిరగాలంటే అస్సలు వీలు కాదు. అందుకే ఇప్పుడు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు ఇంటీరియర్ డిజైనర్లు. ఇంట్లో డోర్ మ్యాట్, లివింగ్ రూం మ్యాట్ల కోసం చేతితో నేసిన తివాచీలు తయారుచేశారు. అదేనండీ వెచ్చదనాన్నిచ్చే రగ్గులు. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఈ సరికొత్త ట్రెండ్స్ సందడి చేస్తున్నాయి. ఈ సీజన్లో ఇంటిని కేవలం అందంగా అలంకరించడమే కాకుండా, మనసుకు ప్రశాంతతను, శరీరానికి హాయిని అందించే డిజైన్లకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రకృతికి దగ్గరగా ఉండే సహజ రంగులు, బయోఫిలిక్ టెక్స్చర్స్, టోనల్ లేయరింగ్, ఆర్భాటం లేకుండానే రిచ్ లుక్ ఇచ్చే ‘క్వైట్ లగ్జరీ’ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
ఈ వింటర్లో చేతితో నేసిన తివాచీలు (హ్యాండ్ క్రాఫ్టెడ్ రగ్గులు) ఇంటీరియర్ డిజైన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సహజమైన ఫైబర్స్, విభిన్నమైన అల్లికలు, ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందిన ఈ రగ్గులు గదులకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నాయి. సంప్రదాయ హస్తకళల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూనే ఆధునిక ఇంటీరియర్‌కు చక్కగా సరిపోతున్నాయి. ముఖ్యంగా ఉన్ని, కాటన్ వంటి సహజమైన పదార్థాలతో తయారైన రగ్గులు చలికాలంలో నేలకు వెచ్చదనాన్ని అందిస్తాయి. లివింగ్ రూమ్, బెడ్రూమ్లో వీటిని ఉపయోగించడం వల్ల గదికి హాయిగా, ఆహ్లాదకరంగా ఉండే రూపం వస్తుంది. అంతేకాకుండా, మట్టి రంగులు, చెక్కతో చేసిన ఫర్నిచర్, మృదువైన లైటింగ్, సహజమైన వస్ర్తాలతో ఇంటికి మరింత అందాన్ని తీసుకురావచ్చు. మొత్తంగా సంప్రదాయం, కళాత్మకత, ఆధునికత కలగలిసిన ఈ వింటర్ ట్రెండ్స్ ఇంటిని వెచ్చని, సౌకర్యవంతమైన, ప్రశాంతమైన ఆశ్రయంగా మారుస్తున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

