ఉదయం వ్యాయామం అటకెక్కుతుంది.. ‘విటమిన్ డి’ లోపం ఏర్పడుతుంది!
శీతకాలం.. చలితోపాటు సోమరితనాన్నీ వెంట తెస్తుంది. ఎముకలు కొరికే చలిగాలులు వీస్తుంటే.. ఉదయం వ్యాయామం అటకెక్కుతుంది. అదేసమయంలో సూర్యుడి నుంచి ప్రకృతిసిద్ధంగా లభించే ‘విటమిన్ డి’ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
కాస్త ‘ఎండ’పట్టున ఉండండి..
శీతకాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. సూర్యుడు ఆలస్యంగా ఉదయించి, త్వరగా అస్తమిస్తాడు. కాబట్టి, ఎండలో గడిపే సమయం తక్కువగా ఉంటుంది. ఇక చలి నుంచి ఉపశమనం కోసం ఒంటి నిండా స్వెట్టర్లు, జాకెట్లు ధరిస్తారు. దాంతో, సూర్యరశ్మి చర్మానికి నేరుగా సోకదు. ఉదయం పూట ఉండే దట్టమైన పొగమంచు, కాలుష్యం వల్ల సూర్యుని కిరణాలు నేలమీదకు సరిగ్గా చేరలేవు కూడా. ఫలితంగా.. శీతకాలంలో ‘విటమిన్ డి’ లోపం సర్వసాధారణంగా మారుతుంది.
ఎండలో గడపడమే..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో నిలబడటం మంచిది. చేతులు, కాళ్లకు ఎండ తగిలేలా చూసుకోవాలి. చలికాలంలో ఈ ఎండ చాలా హాయిగా ఉంటుంది కాబట్టి ఇది సులభమే!
ఆహారంలో మార్పులు..
కేవలం ఎండ ద్వారానే కాకుండా, కొన్నిరకాల ఆహార పదార్థాల ద్వారా కూడా ‘విటమిన్ డి’ని పొందవచ్చు. సాల్మన్, మాకేరెల్, సార్డీన్స్ లాంటి చేపలు, ఉడకబెట్టిన గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక శాకాహారులైతే.. ‘విటమిన్ డి’ పుష్కలంగా లభించే పుట్టగొడుగులను ఆశ్రయించవచ్చు. తృణధాన్యాలు, ఆరెంజ్ జ్యూస్‌తో కూడా కావాల్సినంత ‘విటమిన్ డి’ లభిస్తుంది. ఒకవేళ రక్త పరీక్షల్లో ‘విటమిన్ డి’ స్థాయులు చాలా తక్కువగా ఉంటే.. వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది.
వైతాళికుల వాణి
జీవితం ఒక సాహసోపేతమైన ప్రయాణం కావాలి. లేదంటే అది జీవితమే కాదు!
– హెలన్ కెల్లర్, ఆంగ్ల రచయిత్రి
క్యా సీన్ హై!

Kya Scene Hai
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

